కేసీఆర్ ఎన్నికల తేదీని ఎలా ప్రకటిస్తారు!! కేసీఆర్ కు అనుకూలంగా ఈ.సి. – మర్రి శశిధర్ రెడ్డి.

హైదరాబాద్:
కేసీఆర్‌కు లాభం చేకూర్చేలా ఈసీ వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోతే మన దేశంలో ప్రజాస్వామ్యనికి చాలా విచారకరమైన రోజు వస్తుందని, టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ చైర్మెన్ మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ స్వయంగా ఎన్నికల తేదీలను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. తొందరగా ఎన్నికలు నిర్వహించాలన్న ఆతృతపై ఎన్నికల కోడ్ కింద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోక వైపు సుప్రీం కోర్టు ఎన్నికలపై ఏమైనా స్పందిస్తుందో అని, చాలా మంది అధికారులు మా కమిటీ వైపు చూస్తున్నారని తెలిపారు.
అంతే కాకుండా ఈవీఎంల పరీశీలనలో అమ్మాయిలు కూడా ఉన్నారు.వారు 16 గంటలు పనిచేయాల్సిన అవసం ఏముందో చెప్పాలన్నారు. ఈసీ వీటన్నింటిని గమణిస్తుందా లేదా అని శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికల కమిషన్ గమనించాలి.తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముందస్తు పేరుతో జరుగుతున్న విషయాలు ఈసీ గమనించాలన్నారు.హైదరాబాద్‌కు వచ్చిన ఎన్నికల టీమ్ ఇచ్చిన నివేదిక బయట పెట్టాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ పారదర్శ కంగా పనిచేయాలన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై చూసీ చూడనట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
ఓటర్ల లిస్ట్‌ల సవరణకు సరైన సమయం ఇవ్వనందున్న మేము సుప్రీం కోర్టులో పొరాడుతున్నాం అని తెలిపారు. ఈసీ కేసీఆర్‌కు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు నెలలో చేయాల్సిన ఎన్నికల పనులను, కేవలం 4వారాల్లో పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఇది కేసీఆర్‌కు మద్దతుగా జరుగుతున్న తంతుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను తప్పు పడుతుందన్నారు. అంతే కాకుండా ఎన్నికల పనుల కోసం హర్యానా నుంచి వచ్చిన కానిస్టేబుల్ కొంపల్లి వద్ద హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్నికల సిబ్బంది మీద ఎంత పని ఒత్తిడి ఉందో అర్థమమవుతోందని శశిధర్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగం ఉల్లంఘన చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగడం తప్పు అని మరి ఎన్నికల సంఘం మాత్రం దీనిపై స్పందించడం లేదని న్యాయవాది జంధ్యాల రవి శంకర్ ప్రశ్నించారు. ప్రభుత్వం రద్దు ఆయిన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది అన్న ఈసీ, ఆపద్ధర్మ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తుందన్నారు. మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇంకా గన్‌మెన్‌లను, కాన్వాయ్‌లను సైరన్ లను వాడుతున్నారని తెలిపారు. పోలీసు అధికారులను బదిలీ చేసే అధికారం ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండదన్నారు. ఈసీకి అధికారం ఉంది ప్రస్తుత డీజీపీ ని కూడా మార్చొచ్చు.
ప్రభుత్వ సొమ్ముతో ఇప్పటికీ ప్రచార పనులు చేస్తున్నారు, ఇలా చేస్తే మేము న్యాయం కోసం హైకోర్టుకు వెళతామన్నారు. అంతే కాకుండా ఇవన్నీ ఈసీ కనపడటం లేదా, ఈసీ చర్యలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యేకంగా లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. జరుగుతున్న పరిణామాలపై అన్ని రాజకీయా పార్టీలు ఈసీని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని జంద్యాల తెలిపారు.