కేసీఆర్ ఓటమి ఖరారు. – పొన్నం.

కరీంనగర్:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై ఈ డీ, ఐ టి దాడులు, కాంగ్రెస్ నాయకులపై పాత కేసులు తిరగదొడడంతో కేసీఆర్ ఓటమి ఖరారు అయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు.
టీఆరెస్ కక్ష సాధింపు చర్యమాత్రమే అని ఆయన చెప్పారు. ఎప్పటిదో పాత అంశం తీసి ఎన్నికల ముందు రేవంత్ ప్రతిష్టను దిగజార్చే ఈ కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కెసిఆర్ వరుసగా కాంగ్రెస్ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు భయపడబోరని పొన్నం స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మరింత పట్టుదల తో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి టీఆరెస్ ను ఓడిస్తారని ఆయన ప్రకటించారు..