కేసీఆర్ ఓటమి తోనే కాంగ్రెస్ జైత్రయాత్ర. – టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్.

హైదరాబాద్:


గ‌జ్వెల్ నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కులంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి ముఖ్య‌మంత్రి కేసిఆర్ ను ఒడించాల‌ని ఉత్తమ్ కోరారు.
టిఆర్ ఎస్ ఒట‌మి గ‌జ్వెల్‌తోనే మొదలు కావాల‌ని టిపిసిసి అధ్యక్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమ‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన గ‌జ్వెల్ కాంగ్రెస్ నాయ‌కులతో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. టిపిసిసి మేధావుల ఫోరం చైర్మ‌న్ అనంతుల శ్యామ్ మోహ‌న్‌, బండారు శ్రీ‌కాంత్, జ‌శ్వంత రెడ్డి, మంగోల్ శ్రీ‌నివాస్ గౌడ్‌ల‌తోపాటు వంద‌లాది మంది నాయ‌కులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ గ‌జ్వెల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చాల శ్ర‌మ‌ప‌డుతున్నార‌ని, పార్టీ విజయానికి మ‌రింత శ్ర‌మించాల‌ని అన్నారు. శ‌క్తి ఆప్‌లో గ‌జ్వెల్ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున చేర్పించాల‌ని పార్టీ విజ‌యానికి ‘శక్తి ఆప్’ చాల కీల‌క‌మ‌ని ఆయ‌న వివ‌రించారు.