కేసీఆర్ ‘కక్ష రాజకీయం’.

హైదరాబాద్:
రేవంత్ రెడ్డి ఇంటిపై ఐ.టి ఈ డి దాడుల వెనుక రాజకీయ కక్ష సాదింపులు ఉన్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హై కోర్ట్ కొట్టి వేసిన కేసులను, ఏళ్ల కిందటి పాత కేసులను బయటకు తీసి కాంగ్రెస్ నాయకులను అనగతొక్కే కుట్ర చేస్తున్నారని చెప్పారు. మొన్న జగ్గారెడ్డి కేసులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఈ డి దాడులు ఇవన్నీ టిఆర్ఎస్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు.కె సీఆర్ కు భయం వేటాడుతోందని, అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నట్టు ఉత్తమ్ విమర్శించారు.