కేసీఆర్ కు ఓటేస్తే ‘గడీ’ లకు గులామీ చేసినట్టే.

హైదరాబాద్:
టీఆరెస్ కు ఓటేస్తే ‘గడీ’ పాలనకు గులాంగిరీ చేసినట్లేనని టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు ప్రభాకర్ పొన్నం అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కేసీఆర్ అజ్ఞాని, మూర్కుడు అని అన్నారు. సోనియా గాంధీని అమ్మనా – బొమ్మనా అన్న KTR మరో మూర్కుడు అన్నారు. కేటీఆర్ కు ప్రజాస్వామ్యం తెలియదని చెప్పారు.
కేసీఆర్, KTR లకు నైతిక విలువలు లేవని పొన్నం విమర్శించారు భారత పౌరసత్వం లేని వేములవాడ టీఆరెస్ అభ్యర్థికీ తండ్రి, కొడుకులు మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతియ పార్టీలు ఉంటాయన్నారు.”కాంగ్రెస్ కు వేసే ఓటు ఢిల్లీ కి వేసినట్టు అంటున్నావు. TRS పార్టీకి వేసిన ఓటు మీ గడిలకు వేసినట్ట”ని పొన్నం విరుచుకుపడ్డారు.ప్రజలను కలవకుండా ఉన్న సీఎం కేసీఆర్ ని ప్రజలు సస్పెండ్ చేస్తారని టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు చెప్పారు.
కొండగట్టు లో వాటర్ ట్యాంక్ కూలి జనాలు చనిపోతే ఆనాడు వైస్ రాజశేఖర్ రెడ్డి వస్తే మొన్నటి రోజు బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా చనిపోతే కేసీఆర్ రావడానికి తీరిక లేదని విమర్శించారు. వేములవాడ లో జర్మనీ రాజ్యాంగ ఉందా? భారతదేశ రాజ్యాంగ ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రద్దు అయినాక, ఎలక్షన్ కోడ్ వచ్చాక కూడా అధికారిక కార్యక్రమాలు సాగుతున్నట్టు ఆరోపించారు.
‘గడి’ల పాలన పోవాలి. తెలంగాణా రాష్ట్ర సస్యశ్యామలం కావాలన్నారు. తల్లి సోనియాగాంధీ తెలంగాణ రాష్టం ఇచ్చిందన్నారు. తెలంగాణ రాకపోతే KTR, కవిత ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని పొన్నం తెలిపారు.వేములవాడ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవ్వరికీ టిక్కెట్టు ఇచ్చినా రమేష్ బాబు ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిని గెలిపిస్తామని ఆయన తెలిపారు.గడిలా పాలనకు గులాములం కాదల్చుకోలేదని, తెలంగాణ రాష్ట్రం లో ప్రజారంజక పాలనను తీసుకువస్తామని మాజీ ఎంపీ చెప్పారు.