కేసీఆర్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లే. -జైపాల్ రెడ్డి.

మహబూబ్ నగర్.
కేసిఆర్ కు ఓటేస్తే హిందూత్వ మోడీ కి ఓటు వేసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు.”కేంద్రంలో కాంగ్రీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఒకేసారి 72 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసినం. KCR లక్ష రూపాయల రైతు రుణాలను 4 విడతలుగా మాఫీ చేసిండు. 4 సంవత్సరాలుగా రైతులు వడ్డీ భారం తో నడ్డి విరిచాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పలేదు.4 సంవత్సరాలు రైతులను ముంచి ఇప్పుడు 4 వేలు ఇస్తున్నాడు.ఎన్నికల వేల లంచం లాగా. నాలుగున్నర సంవత్సరాలుగా నిద్రపోయిన KCR కు రైతులు ప్రజలు ఇప్పుడు గుర్తుకువచ్చార. KCR పాలనలో అవినీతి పెరిగిపోయింది. KCR ఇచ్చిన హమిలి 3 ఎకరాల భూమి,2 బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ కనపడడం లేదు నారాయణపేట నియోజక వర్గం లో. సాగునీటి ప్రాజెక్టులు అవినీతి ప్రాజెక్టు లుగా మారినవి. మోడీ గారితో KCR రహస్య వొప్పదం కుదుర్చుకొని పాలనా కొనసాగిస్తున్నాడు.2019 ఎన్నికలు అగ్ని పరక్షలాంటివి ప్రజాలరా గమనించి నియంత లాగా పాలనా సాగిస్తున్న మోడీ ని గద్దెదించాలి. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే నారాయణపేట ను జిల్లా గా చేస్తాం GO 69 తో జయమ్మ చెరువును కృష్ణ నీటితో నింపి 3 మండలాలకు తాగు సాగు నిరిస్తామ”ని జైపాల్ రెడ్డి చెప్పారు.