కేసీఆర్ కు ముస్లింల ఓట్లడిగే హక్కు లేదు.సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి.

జగిత్యాల:
ప్రధాన మంత్రి సమావేశంలో, నీతి ఆయోగ్‌లోనూ కేసీఆర్‌ ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు లెవనెత్తలేదని కేసీఆర్‌ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామిల్లో నాలుగు నెలల్లోనే 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తానని.. నాలుగేళ్ల గడిచిన పట్టించుకోవటంలేదన్నారు. గిరిజనలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు రాష్ట్ర పరిధిలో ఉన్నా.. ఎందుకు అమలు చేయటంలేదని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు,గిరిజనులకు రిజర్వేషన్‌ అమలు చేయకపోతే కేసీఆర్‌కు ఓటు అడిగె నైతిక హక్కులేదన్నారు. ప్రధానమంత్రి సమావేశంలో ఆయన గొప్పలు చెప్పుకోవటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. మిత్ర పక్షమైన బీహర్‌ సీఎం నితిష్‌కుమర్‌ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదిసే ప్రయత్నం చేశారని కానీ.. కేసీఆర్‌ఎందుకు నోరు మొదపటంలేదో చెప్పాలన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏమైందని .. మమత బెనర్జి ని ఎందుకు కలిసి రాలేదో చెప్పాలన్నారు. ఏపీ సీఎం రాష్ట్ర ప్రయోజనాల అంశాన్ని లెవనెత్తితే,ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్ర అంశాలను మరిచి గొప్పలు చెప్పుకునేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.