కేసీఆర్ కు వ్యతిరేకంగా ‘ప్రజాకూటమి’!

హైదరాబాద్;

టిఆర్ఎస్ ను గద్దె దింపడమే తమ లక్ష్యమని ‘ప్రజాకూటమి’ ప్రకటించింది. రాజకీయాలల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిరూపించాయి. ‘ప్రజాకూటమి’ ని ప్రజలు ఆదరిస్తారని, టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని ఆ పార్టీలు తెలిపాయి. అన్నిసర్వేల వివరాల ప్రకారం ‘ప్రజా కూటమి’ కి 80 కి పైగా స్థానాలను గెలుచుకోనున్నట్టుటీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ 30 స్థానాలకు పరిమితమవుతుందన్నారు. ‘కూటమి’ భాగస్వామ్య పార్టీలతో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. సీట్ల సర్దుబాట్లపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో కూడా చర్చలు కొనసాగుతున్నట్టు టిపిసిసి అధ్యక్షుడు తెలిపారు. తాము పోటీ చేయద‌లిచినసీట్ల‌పైటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కసరత్తు పూర్తి చేసి ఒక జాబితాను కాంగ్రెస్‌కు అందజేశాయి. అందులో టీడీపీ15, సీపీఐ12, టీజేఎస్ 25 స్థానాలకు సంబందించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినవి. ‘కూటమి’ కి కామన్ ఎజెండా రూపొందించాలని, అధికారంలోకి వస్తే ‘ప్రత్యేక కౌన్సిల్’ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని జనసమితి కోరుతున్నారు. కోదండరాంను ఆ కౌన్సిల్ కు చైర్మన్ గా నియమించాలని జనసమితికోరుతున్నది. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే తాము కోరుతున్నట్టు టిడిపి తెలిపింది.