కేసీఆర్ దగుల్భాజీ!! -ఉత్తమ్.

హైదరాబాద్:

తెలంగాణలో నాలుగున్నరేళ్లు దగుల్బాజీ సీఎం రాజ్యం ఏలాడని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆరోపించారు.డిసెంబర్ పన్నెండున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పదుతుందని అన్నారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం అని హామీ ఇచ్చారు.మాట నిలబెట్టుకోని కెసిఆర్, కవిత నిజామాబాద్ ఓటర్లను ఓటు అడిగే హక్కు లేదన్నారు.నాలుగు వేల ఐదొందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా కెసిఆర్ పరామర్శించలేదని విమర్శించారు.తెలంగాణాలో కేసీఆర్ బంగారు కుటుంబమే అభివృద్ధి చెందిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలను అణచివేశాడన్నారు.ప్రజలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి గోరి కట్టాలని కోరారు.గత కాంగ్రెస్ పాలన వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందన్నారు.రైతు బందు ఎన్నికల డ్రామా, మొదటి రెండు మూడు సంవత్సరాలు రైతు బందు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ప్రగతి భవన్ ని ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చుతామని ఉత్తమ్ చెప్పారు.వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు.కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కలిపి వరికి క్వింటాకు రెండు వేలు,మొక్కజొన్న క్వింటాకు రెండు వేల చొప్పున కొనుగోలు చేస్తాం.

పత్తి క్వింటాకు ఆరు వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తాం. ఎర్రజొన్నల మూడు వేలు తక్కువకాకుండా కొనుగోలు చేస్తాం. పసుపు మిర్చి క్వింటాకు పది వేలు తక్కువకాకుండా కొనుగోలు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది” అని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

*ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది*
*నిరుద్యోగుల త్యాగాలను మరచి కెసిఆర్ కెసిఆర్ కుటుంబం విలాసాల్లో మునిగి తేలుతుంది*
ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం
వంద రోజుల్లో ఇరవై ఐదువేల మంది ఉపాధ్యాలు భర్తీ చేస్తాం
*టీఆరెస్ గ్రామ గ్రామాన మద్యంతో నింపుతోంది *
*కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి డబ్బు మద్యాన్ని అడ్డుకోవాలి*