కేసీఆర్ దురహంకారి! – భట్టి నిప్పులు.

హైదరాబాద్:
కాంగ్రెస్ నాయకులపైన, ప్రజా సంఘాలపైన, విప్లవ సంఘాలపైన, ప్రశ్నించే గొంతులపైన వేధింపులు, కేసులు, అరెస్టులు పాలకుల దూరహంకార ధోరణికి నిదర్శనమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. రేవంత్ పైన రాజకీయ కక్ష సాధింపు ప్రజాస్వామ్యనికి చేటు అన్నాారు. ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలని అనుకోవడం ప్రజాస్వామ్య మూల సిద్ధాంతానికి విఘాతం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పై పెట్టిన కేసులు రాజకీయ దురుద్దేశంతో కూడినవని భట్టి ఆరోపించారు.