కేసీఆర్ నయా ఫ్యూడాలిజం అంతమే నా పంతం. రానున్నది ‘ఓటు విప్లవం’. -గద్దర్.

ప్రకాశ్, న్యూడిల్లి:

తెలంగాణలో నయా ఫ్యూడలిజాన్ని అంతం చేయడమే తన లక్ష్యమని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. తనను కాంగ్రెస్ లో చేరాలని రాహుల్ గాంధీ ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించినట్టు ఆయన తెలిపారు.

‘రాజ్యాంగాన్ని కాపాడండి.. దేశాన్ని కాపాడండి’అనే ఉద్యమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారని దాని గురించి అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు.తన ఉద్యమాన్ని పాటల ద్వారా వివరించానన్నారు.రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజల దగ్గరకు పోదాం అన్నది తన నినాదంగా చెప్పారు.దిల్లీలో ఫుడలిజం(బుర్జువా వ్యవస్థ) పాలన సాగిస్తోందన్నారు. తనపై జరిగిన తూటాల దాడి వివరాలు రాహుల్ అడిగి తెలుసుకున్నట్టు గద్దర్ చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననడం, భూమి ఇస్తానని చాలా హామీలు మరచిపోయారని అన్నారు.”నయా ఫుడలిజం వచ్చింది. తెలంగాణలో కూడా రాజ్యాంగ రక్షణ అవసరం అయింది. పార్టీలో చేరుతారా అని రాహుల్ అడిగారు. ఏ పార్టీలో చేరనని చెప్పాను. ప్రజా గాయకుడిగా పాటలతోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా చెప్పాను. సెక్యూలర్ బలలాను ప్రజలకు చేరవేస్తాం. సెక్యూలర్ ఎక్కడ ఉంటే వారిని కలుస్తాం. సెక్యూలర్ పార్టీ ప్రజలకు మధ్య వారధిగా ఉంటా.రాహుల్ తో పాటు మిగిలిన సెక్యూలర్ పార్టీలను కూడా కలుస్తా. నయా ఫుడలిజం అంతం చేయడమే నా లక్ష్యం. ఒకవేళ అన్ని పార్టీలు కోరితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా. రాహుల్ తో ఎన్నికల పోటీ వంటి చర్చే జరగలేదు.నా కుమారుడు ప్రచారానికి రమ్మంటే వెళ్తా ప్రచారం చేయడానికి. ఓటు విప్లవానికి అందరూ సిద్ధం కావాలి” అని గద్దర్ స్పష్టం చేశారు.