కేసీఆర్ నియంత.కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

హైదరాబాద్:
కోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని,కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు.తమ సభ్యత్వం పునరుద్ధరించాలి అని కోర్ట్ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరారు.రాజ్యాంగం..న్యాయ వ్యవస్థ మీదా కేసీఆర్ కి నమ్మకం లేదన్నారు.ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం అని విమర్శించారు.న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు,న్యాయస్థానం ని కూడా మోసం చేస్తున్నారన్నారు.డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేస్ పిటిషన్ వేశారని తెలిపారు.కోర్ట్ ధిక్కార నోటీస్ ఇస్తామని చెప్పారు.అసీంబ్లీ కార్యదర్శి..cs లను కూడా బాద్యులను చేస్తామన్నారు.సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుందన్నారు.రేపటి లోగా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తమ కోసం సభలో ఆందోళన చేయలేదని గుర్తు చేశారు.అందరం రాజీనామా చేయాలి అనుకున్నామని తెలిపారు.ఇప్పుడైనా.. రాజీనామాల మీద నిర్ణయం తీసుకోమని చెప్తున్నా నన్నారు.CLp నేతగా జానారెడ్డి తమను కాపాడాలని కోరారు. పార్టీ నాయకులతో చర్చించి.. అందరం రాజీనామా చేద్దామని చెప్పారు.ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని కోమటిరెడ్డి అన్నారు.కేసీఆర్ ఎన్నో సార్లు రాజీనామా చేశారని అన్నారు.రాష్ట్ర నాయకత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో వాళ్లనే అడగండి అని వెంకటరెడ్డ్డి అన్ననరు.