కేసీఆర్ నియోజకవర్గంలో ఎన్నికల్ని బహిష్కరించిన గ్రామం.

గజ్వేల్:
ఎన్నికలను బహిష్కరించాలని ‘కొత్తపేట’ గ్రామస్తులు నిర్ణయించడం సంచలనం సృష్టిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జగదేవపూర్‌ మండలం కొత్తపేటలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజలు తీర్మానం చేశారు. ఈమేరకు గ్రామస్తులందరూ సమావేశమయ్యారు. అనంతరం త్వరలో జరిగే ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించుకున్నారు. గ్రామంలోని 700ఎకరాల వ్యవసాయ భూములకు నేటికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదని, దీనికి నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.