కేసీఆర్ ను ఓడించండి. ‘ఒంటేరు’కు రాహుల్ ఫుల్ సపోర్ట్.

న్యూఢిల్లీ:
ఢిల్లీలో రాహుల్ గాంధీని గజ్వెల్ నియోజకవర్గ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కలిశారు.”వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ,కేసీఆర్ ను ఓడించండి ప్రతాప్ మీకు రెడ్ కార్పెట్” అంటూ ఒంటెరుకు రాహుల్ భరోసా ఇచ్చారు.ఇప్పటికే ప్రచారంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి దూసుకుపోతున్నరు.

గజ్వెల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన ధ్యేయంగా ఒంటేరు చెప్పారు. తెలంగాణలోఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్ కమీషన్ల కోసమేనని ఆరోపించారు.కేసీఆర్ తెలంగాణలో చేయించిన సర్వేలన్ని తప్పుడు సర్వేలు,త్వరలో అసలు సర్వే బయట పెడతామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేలలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని తేలిందన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర రాజకీయం మారనుందన్నారు.టీఆరెస్ పార్టీ గ్రాఫ్ తగ్గింది,కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఒంటెరు చెప్పారు.అతి త్వరలో టీఆరెస్ కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రతాప రెడ్డి తెలిపారు.