కేసీఆర్ ను ప్రశ్నించడమే నేరం.- దామోదర రాజనరసింహ్మ, కోమటిరెడ్డి.

హైదరాబాద్:

కేసీఆర్ ను ప్రశ్నిస్తే నేరంగా మారినట్టు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.పోలీసు కేసులు, ఐటి రైడ్స్ కామన్ అయ్యాయని ఆరోపించారు. నిన్న జగ్గారెడ్డి ,ఈరోజు రేవంత్ రెడ్డిలపై కేసులను వారు ఉదహరించారు.కేసీఆర్ నియంత పోకడలను ఎదిరిస్తామని వారు ప్రకటించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకోడని అన్నారు.

కేసీఆర్ మొన్న తనను టార్గెట్ చేసాడని,నిన్న జగ్గారెడ్డి,ఈరోజు రేవంత్ రెడ్డి పై కేసులు పెట్టించారని వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ సంపత్ ను బలిచేసాడని కూడా ఆయన ఆరోపించారు.కేసీఆర్ పెట్టించే కేసులకు భయపడనన్నారు.ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని ఆయన అన్నారు.