కేసీఆర్ పాలనలో బడిబాట సక్సెస్.

వరంగల్;
బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్   పాల్గొన్నారు. శాయంపేట హైస్కూల్లో బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన  ఎమ్మెల్యే దాస్యం  వినయభాస్కర్ , అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి  కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో  ముఖ్యమంత్రి కెసిఆర్  ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఉచిత విద్య కొరకై పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి నట్టు ఎం. ఎల్. ఏ.తెలిపారు.ప్రైవేటు పాఠశాలలకంటే మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నామని వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది . కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరుణ శివ శంకర్ , జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి , మండల విద్యాధికారి వీరభద్రం, ఇతర విద్యాధికారులు, ప్రజాప్రతినిధులు ,టీఆర్ఎస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు