కేసీఆర్ పాలిత తెలంగాణ!!

కేసీఆర్ ‘ఆశీర్వాద సభలన్నీ’ ప్రత్యర్థులపై ‘దండయాత్ర’ వలె సాగుతున్నవి. హైదరాబాద్ నుంచి అమరావతి దాకా.. ఆపైన నెల్లూరు, శ్రీకాకుళం, ఇటు రాయలసీమ ప్రాంతాలన్నీ కేసీఆర్ ప్రకటనలు, వ్యక్తిగత దూషణలపై ‘కౌంటర్ ప్రకటనల’ తో దద్దరిల్లుతున్నవి. కేసీఆర్ కు కావలసింది అదే. కేసీఆర్ కోరుకున్నట్టే జరుగుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును కూడా కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ‘ఉచ్చు’ లోకి లాగారు. కేసీఆర్ కన్నా స్వరం ఎంత పెంచి అరచినా ప్రతిపక్షాలవి’అరణ్య రోదనే’. అరకొర న్యూస్ చానళ్లుమినహా కేసీఆర్ ప్రత్యర్థులకు ఆశించిన ప్రచారం దొరకడం కష్టం. పత్రికలూ అంతే. వాటి బలహీనతల గురించి పెద్దగా చర్చ అవసరం లేదు. అయితే సామాజిక మాథ్యమాల్లో మాత్రం టిఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఎండగడుతూ పోస్టింగులు వస్తున్నవి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు , మహా కూటమికి, చంద్రబాబుకు పుష్కలంగా మద్దతు లభిస్తున్నది.”తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరుగుతున్నది. మేఘా, నవయుగ, గాయత్రి లాంటి ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుల కూచుని, తుమ్మల, తలసాని లాంటి ఎందరెందరో తెలంగాణను వ్యతిరేకించినోళ్లను కుడి ఎడమల పెట్టుకొని, రామోజీకిబంటుగ మారి, రామానాయుడు, హరికృష్ణలకు గౌరవ వందనాలు చేసి, హైదరాబాదు ఆంధ్రుల ఆశాజ్యోతి అని పిలిపించుకుంటూ, తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడం, బిర్యానీ – పులావ్ వాదనలు చేయడం ఎంత అసంగతం. ఆ పనులు చేస్తున్నోళ్లకు తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే అర్హత ఉన్నదా? ఎన్నికల వేళ గనుకనే మళ్ల సెంటిమెంటు గుర్తొస్తున్నదా?. మాట్లాడుకోవలసినరాజకీయార్థిక, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఉన్నయి. తామే మరిచిపోయిన, తామే వదిలిపెట్టిన, తామే ఏడు నిలువుల లోతు పాతిపెట్టిన తెలంగాణ సెంటిమెంటును తవ్వితీసి, పౌడరేసి, బొట్టుపెట్టి, ఊరేగించడానికి ప్రయత్నం చేస్తున్నోళ్లను చూస్తుంటే నాకు నవ్వు ఆగుతులేదు. చెప్పెటోనికి సిగ్గు లేకపోయినా వినేటోనికి వివేకం ఉండాలి” అని సీనియర్ జర్నలిస్టు, ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

 

ఎస్.కె.జకీర్.

సభా వేదికపై పూనకం వచ్చినట్టుగా కేసీఆర్ ఊగిపోతున్నారు. రగిలిపోతున్నారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ”మీ బతుకు చెడ” అంటున్నారు. ”తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తా! థూ… ” అని చెలరేగిపోతున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణుల రక్తం సలసల కాగే రీతిలో కేసీఆర్ వేడెక్కిస్తున్నారు.ఊహించినట్టుగానే నిజామాబాద్ సభకు పార్టు 3 గా వనపర్తి లో కేసిఆర్ ప్రసంగం సాగింది. ” చంద్రబాబు పాదం మోపిన చోట పచ్చని చెట్టు కూడా కాలి బూడిద అవుతుంది. నీ దమ్మెంటో, నా దమ్మెంటోతేల్చుకుందాం రా !చంద్రబాబు పాలమూరు గుండెల మీద గుద్దిండు. మళ్ళీ చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా? కాంగ్రెస్ నాయకులకు సొంతంగా తెలివి లేదు. తెలంగాణకు పట్టిన దరిద్రం, శని, చీడ పురుగు కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీకి లేదా అమరావతికి గులాములవుదామా? డీకే అరుణా…. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ బండారం బయట పెడతా!!” అని కేసీఆర్ చంద్రబాబు పైనా, టీకాంగ్రెస్ నాయకులపైనా నిందారోపణలతో దండెత్తారు. ఏ ‘సెంటిమెంటు’ నుంచైతే తాను దూరమవుతూ వస్తున్నట్టు విమర్శల పాలయ్యారో, అదే సెంటిమెంటును ప్రాణవాయువుగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. నోటిఫికేషన్ రావలసి ఉన్నది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అందరికన్నా ముందున్నారు. ఆయన వేగం, కసి తెలియనివారికి మాత్రమే ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేసీఆర్ ‘గరుడ వేగ’. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటి మంచి చెడుల ఆయనకు నిమిత్తం లేదు. లాభ నష్టాలతో పని లేదు. తెలంగాణ సెంటిమెంటు హఠాత్తుగా కేసీఆర్ కు గుర్తుకు వచ్చిందనడంసరైనది కాదు. ఆయనకు ‘టైమింగ్’ బాగా తెలుసు. ఏ టైములో ఏమిచెప్పాలో, ఏ టైములో ఏది అమలు చేయాలో కేసీఆర్ కు తెలుసు. అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ కన్నా 9 నెలల ముందుగానే ఎందుకు తీసుకు రావలసి వచ్చిందో హుస్నాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి సభలలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ఇక ముందు అయినా స్పష్టత వస్తుందని ఎవరు అనుకోవడం లేదు. ఇప్పటిదాకా కేసీఆర్ బహిరంగసభల్లో కానీ, ఇతర సమావేశాల్లో కానీ చెప్పిన ‘ముందస్తు’ కారణాలు హేతుబద్ధంగా లేవు. అవి సాధారణ జనం నమ్మే విధంగా లేవు. ‘ముందస్తు’ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకున్నారు. కనుక అసెంబ్లీని రద్దు చేశారు. సరే, ఇప్పుడిక ఎన్నికల ప్రచార పర్వాన్ని పరిశీలిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఆయుధాలను పక్కనబెట్టి ‘తెలంగాణ సెంటిమెంటు’ కవచం తొడుక్కున్నారు. అంటే ప్రజల్లో ‘తెలంగాణ’ కార్డు మాత్రమే బలంగా పనిచేయగలదని ముందస్తుగా ఆయన అంచనాకు వచ్చి ఉంటారు. కానీ ఆచరణలో ఈ కార్డు ‘ బూమరాంగ్’ అవుతుందా? లేక ఆశించిన ఫలితమిస్తుందా? చూడవలసి ఉన్నది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు జనానికి త్వరగా ‘కిక్కు’ నివ్వవుఅని కేసీఆర్ నిర్ధారించుకొని ఉంటారు. అందుకే ‘సెంటిమెంటు’ కత్తి దూశారు. అటు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకనాటి తన గురువు, లేదా సహచరుడో, మిత్రుడో అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైన, తెలంగాణ కాంగ్రెస్ నాయకులపైనా అలుపెరగకుండా కత్తి యుద్ధం చేస్తున్నారు. గడచిన నాలుగున్నర సంవత్సరాల పాలన విజయాలపై కేసీఆర్ చర్చకు పెట్టదలచుకోలేదు. అలాంటి చర్చకు ఆస్కారమిస్తే సాఫల్యాల కన్నా వైఫల్యాలు ఎక్కువగా బయటపడతాయని అనుకుంటున్నారేమో ! తెలియదు. చర్చను పూర్తిగా ‘సెంటిమెంటు’ వైపు మళ్లిస్తున్నారు. దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ లో ఆయనే హీరో . ఆయనే ప్రచారకర్త. ఆయనే కర్త – కర్మ – క్రియ. కేసీఆర్ తర్వాత ప్రచారాన్ని హోరెత్తించాలంటే మంత్రి హరీశ్ రావుకు సాధ్యమన్నది ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తల మనోగతం. మంత్రి కేటీఆర్ గానీ, సీఎం కేసీఆర్ గానీ హరీశ్ రావును ప్రజల్లోకి పంపించడం ఇష్టపడరని కూడా ప్రజలనుకునే మాట. కారణాలేవైనా హరీశ్ రావు వార్తల ప్రచురణను అధికారపార్టీ పత్రిక ఎందుకు నిలిపివేసిందో, అక్టోబర్ 4, 5 తేదీల నుంచి ఎందుకు ‘పునరుద్ధరించారో’ ఎవరికీ తెలియదు. అక్టోబర్ 4 న మంత్రి కేటీఆర్ నివాసంలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం వ్యూహాత్మకమే. ఈ సమావేశానికి హరీశ్ రావును పిలవడం, ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడడం కేసీఆర్ ఎత్తుగడల్లో భాగమేనన్న ప్రచారం లేకపోలేదు. హరీశ్ కు ప్రాధాన్యం తగ్గించారన్నది వాస్తవం. దాన్ని ఒప్పుకోవడానికి హరీశ్ రావు సిద్ధంగా లేరు. అది వేరే విషయం. పార్టీలో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించినట్టుగా తండ్రి, కొడుకులు ఎక్కడా అధికారికంగా చెప్పరు. రాజకీయపార్టీలో ప్రాధాన్యమన్నది ఒకరు ఇస్తే రావడమో, లేదా తగ్గిస్తే తగ్గడమోఉండకపోవచ్చును. కానీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు తమ ‘సమ ఉజ్జీల’ను, ‘పోటీ దారుల’ను వీలైనంతగా అణచివేయడానికి ప్రయత్నించడం వంటి ఘటనలు, సందర్భాలు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి నుంచి ప్రభుత్వం వరకు గతంలో వివిధ పార్టీలలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నవి. అందులో కొత్తేమీ లేదు. మొత్తంమీద కేసీఆర్ కుటుంబంలో కలతలు, కలహాలు లేవని కేటీఆర్, హరీశ్ గ్రూపు ఫోటోలు దిగి తెలంగాణ ప్రజలకు రుజువు చూపే ప్రయత్నం జరిగింది. కేసీఆర్ ‘ఆశీర్వాద సభలన్నీ’ ప్రత్యర్థులపై ‘దండయాత్ర’ వలె సాగుతున్నవి. హైదరాబాద్ నుంచి అమరావతి దాకా.. ఆపైన నెల్లూరు, శ్రీకాకుళం, ఇటు రాయలసీమ ప్రాంతాలన్నీ కేసీఆర్ ప్రకటనలు, వ్యక్తిగత దూషణలపై ‘కౌంటర్ ప్రకటనల’ తో దద్దరిల్లుతున్నవి. కేసీఆర్ కు కావలసింది అదే. కేసీఆర్ కోరుకున్నట్టే జరుగుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును కూడా కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ‘ఉచ్చు’ లోకి లాగారు. కేసీఆర్ కన్నా స్వరం ఎంత పెంచి అరచినా ప్రతిపక్షాలవి’అరణ్య రోదనే’. అరకొర న్యూస్ చానళ్లుమినహా కేసీఆర్ ప్రత్యర్థులకు ఆశించిన ప్రచారం దొరకడం కష్టం. పత్రికలూ అంతే. వాటి బలహీనతల గురించి పెద్దగా చర్చ అవసరం లేదు. అయితే సామాజిక మాథ్యమాల్లో మాత్రం టిఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఎండగడుతూ పోస్టింగులు వస్తున్నవి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు , మహా కూటమికి, చంద్రబాబుకు పుష్కలంగా మద్దతు లభిస్తున్నది.”తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడానికి ప్రయత్నం జరుగుతున్నది. మేఘా, నవయుగ, గాయత్రి లాంటి ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుల కూచుని, తుమ్మల, తలసాని లాంటి ఎందరెందరో తెలంగాణను వ్యతిరేకించినోళ్లను కుడి ఎడమల పెట్టుకొని, రామోజీకిబంటుగ మారి, రామానాయుడు, హరికృష్ణలకు గౌరవ వందనాలు చేసి, హైదరాబాదు ఆంధ్రుల ఆశాజ్యోతి అని పిలిపించుకుంటూ, తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడం, బిర్యానీ – పులావ్ వాదనలు చేయడం ఎంత అసంగతం. ఆ పనులు చేస్తున్నోళ్లకు తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే అర్హత ఉన్నదా? ఎన్నికల వేళ గనుకనే మళ్ల సెంటిమెంటు గుర్తొస్తున్నదా?. మాట్లాడుకోవలసినరాజకీయార్థిక, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఉన్నయి. తామే మరిచిపోయిన, తామే వదిలిపెట్టిన, తామే ఏడు నిలువుల లోతు పాతిపెట్టిన తెలంగాణ సెంటిమెంటును తవ్వితీసి, పౌడరేసి, బొట్టుపెట్టి, ఊరేగించడానికి ప్రయత్నం చేస్తున్నోళ్లను చూస్తుంటే నాకు నవ్వు ఆగుతులేదు. చెప్పెటోనికి సిగ్గు లేకపోయినా వినేటోనికి వివేకం ఉండాలి” అని సీనియర్ జర్నలిస్టు, ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ”మీరు గతంలో పెట్టుకున్న పొత్తుల గురించి అప్పుడు ఏమి ఆశించి వారితో పొత్తులు పెట్టుకున్నారు. అవి ఎంతవరకు సఫలీకృతం అయ్యాయి..? మీరు పబ్లిక్ మీటింగ్ లలోఆంధ్రవాళ్ళని తిడుతున్నారు. తెరవెనుక వారితో మీ స్నేహం ఏంటి…? రామోజీ రావు ని,చంద్రబాబు ని విమర్శిస్తూ తెలంగాణ లో వారి ఆస్తులను కాపాడే ప్రయత్నం చేయడం లేదా! హరికృష్ణకు స్మారక స్థూపం, ప్రకటించ లేదా? తెలంగాణాలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు ఎన్ని పూర్తి చేసారు. ఎన్నింటి నుండి సాగుకునిరంధిస్తున్నారు…?మన తెలంగాణ నినాదం నీళ్ళు, నిధులు,నియామకాలు, ఇంటింటికి నల్లా, సాగు నీరు, తాగు నీరు , సాగునీటి ప్రాజెక్టులు కొత్త కంపనిలు,ఆదాయ వనరులు, ఇంటికో ఉద్యోగం అన్ని ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎంతవరకు సాధించారు…? ఎన్ని నియామకాలు భర్తీ చేసారు..?అన్నికులాలకు సమాన ప్రతిపత్తి కలిపిస్తూ దళితుడే తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మీ నినాదం నెరవేర్చరా…? మన ప్రభుత్వం లో అందరికి సమన్యాయంచేసారా…? ప్రతి నియోజక వర్గంలో కనీసం 10 డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారా…? దళితులకు మూడు ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు…? చనిపోయిన అమర వీరుల కుటుంబాలను ఎంత మందిని పలకరించారు..?.ఉద్యోగాల భర్తీ కే.జి.నుండి పి. జి ఉచిత విద్యా గురుకులాల పాఠశాలల నిర్మాణం ఎంతమేర సాధించారు…? చనిపోయిన బతికున్న, జర్నలిస్టులకు వారి కుటుంబాలకు మన ప్రభుత్వము ఎలాంటి భరోసా ఇచ్చింది…? హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ,రోడ్ల విస్తరణ డ్రైనేజి పనులు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి.నియోజక వర్గానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి, కాలేజీలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ , మ్.ల్.ఏ క్యాంపు ఆఫీసులు, నియోజక వర్గ అభివృదిసాదించారా…?బతుకమ్మ పండుగ పేరిట ఏటేటా కోట్ల దుర్వినియోగం జరగటం లేదా ? ఇంతకూ మునుపు మేము బతుకమ్మ అడలేదా..? గొఱ్ఱెలు,బర్రెలు,చేపలు, ఈ స్కీములతో మా పిల్లలు మా పాత జీవితాలే జీవించాలా…?మేము అడిగి ప్రశ్నల్లో తప్పులుంటే మమ్మల్నిమాన్నిస్తారని అడుగుతున్నాం సారూ నీ బాంచెన్…. మీ తెలంగాణ ప్రజలు..!!” అంటూ సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతున్నది. ”శ్రీకాంత చారి నుండి మొదలుపెడితే మొన్న అయూబ్ ఖాన్ నిన్న రేగుంటగట్టయ్య కేసీఆర్ ఆటకు బలైనోళ్లే.స్వరాష్ట్ర ఫలాలు ఎవడికి దక్కుతున్నాయి అంటే కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ బంధువర్గానికి, కేసీఆర్ చుట్టూ ఉండే సన్నాసులకు, ఉద్యమ ద్రోహులకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే.ఈ నాలుగున్నర ఏళ్ల నుండి ప్రజల కోసం టీఆరెఎస్ కార్యకర్తల కోసం తెరుచుకోకుండా ఉన్న ప్రగతిభవన్ గేట్లు రేపు తెరుచుకుంటాయాఅని ఒకసారి ఆలోచించండి. నిన్నటి ఉద్యమ ద్రోహులు నేడు బంగారు తెలంగాణ నిర్మాతలు.నిన్నటి ఉద్యమకారులు నేడు బంగారు తెలంగాణలో బికారీలు” అంటూ మరికొందరు తెలంగాణ వాదులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.