కేసీఆర్ పై వికలాంగుల ఫిర్యాదు.

హైదరాబాద్:

వనపర్తి సభలో వికలాంగులను ఉద్దేశించి కుంటివాళ్ళు ; గుడ్డి వాళ్ళు అని కించపరచడం పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో టి పి సి సి వికలాంగుల విభాగం చైర్మన్ ముతినెని వీరయ్య కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం కెసిఆర్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. ఈ అంశాన్ని HRC SR NO..7643/18 క్రింద నమోదు చేయటం జరిగింది. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం మరో 14 రకాల వికలాంగులను గుర్తించకుండా ఏన్నీకల కు పోవడం పై HRC లో టీపీసీసీ వికలాంగుల విభాగం మరో ఫిర్యాదు చేసింది.