కేసీఆర్ ‘ప్రచారకుని’ గా అసద్!!

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సలహా మేరకే కేసీఆర్ ‘ముందస్తు’ ఎన్నికలకు వెళ్లారంటూ చాలా వార్తాకథనాలు ఆగస్టు చివరి నుంచి వెలువడుతూనే ఉన్నవి. ఒవైసీ, కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ల మధ్య ‘విరబూసిన స్నేహ బంధం ‘వల్ల ఆ కథనాలను నమ్ముతున్న వారిలో జనం ఉన్నారు. రాజకీయ పక్షాలూ ఉన్నవి. అధికారంలో ఉన్న రాజకీయపార్టీ మళ్ళీ అధికారంలోకి ప్రతి సీటును, ప్రతి ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అంది వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. మజ్లిస్ పార్టీ తెలంగాణలో బలమైన రాజకీయ శక్తి ఏమీ కాదు. ఆ మాటకొస్తే పూర్తిగా హైదరాబాద్ కు పరిమితమైన పార్టీగా కుదించుకుపోయింది. అయితే రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయిలోను ముస్లిం మైనారిటీల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా, ముస్లిం ల గొంతుక గా మజ్లిస్ కు గుర్తింపు ఉన్నది. తెలంగాణలోని ముస్లిం ఓటర్ల ప్రభావిత ప్రాంతాల్లో టిఆర్ఎస్ కు ఒక ‘మిత్రుడు’ అవసరం. ఆ రూపంలో మజ్లిస్ పార్టీ కేసీఆర్ కు దొరికింది. కేసీఆర్ పై ఈగ వాలినా కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలపై అసదుద్దీన్ ఒవైసీ ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులపై ఆయన చిచ్చరపిడుగులా మాటల ‘దాడులకు’ దిగుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన అసద్ ‘ప్రచారకుని’ గా మారబోతున్నారు. ”కేసీఆర్ కు తిరుగు లేదు. అయన మళ్ళీ అధికారంలోకి రావడం తధ్యం. కాంగ్రెస్ చిత్తు ఆవుతుంది.” అంటూబహుశా అసద్ ప్రసంగాలు మనం వినవచ్చును.

 

ఎస్.కె.జకీర్.

టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ ఆ పార్టీకి ప్రధాన ప్రచారకర్త. ఇప్పుడు వెలుపలి నుంచి మరో పార్టీ నాయకుడు కేసీఆర్ ను, టిఆర్ఎస్ ను ‘మార్కెటింగ్’ చేయడానికి ముందుకొచ్చారు.ఆయన మజ్లిస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.మజ్లిస్, కేసీఆర్ ల మధ్య స్నేహానికి ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధమున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్ర జరుగుతున్నదంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ‘ఉప్పందించిన’ తర్వాతే తాము అప్రమత్తమై ఆ కుట్రలని భగ్నం చేయగలిగినట్టు కేసీఆర్ స్వయంగా ఒక సమావేశంలో చెప్పారు. ఆనాటి నుంచి వారి మధ్య స్నేహం వికసించి, మొక్క అయి, మానుగా మారింది. తాజాగా ఒవైసీ, కేటీఆర్ ల మధ్య చర్చల ప్రక్రియ పూర్తయ్యింది.టీఆర్‌ఎస్‌ నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి ఎంఐఎం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని హైదరాబాద్‌లో కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి అసదుద్దీన్‌ ఓవైసీ సానుకూలంగా స్పందించి భూపాల్‌రెడ్డి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ముస్లిం మైనారిటీ ఓటర్లందరూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారని, నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవటం ఖాయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో టిఆర్ఎస్ తరపున ఒవైసీ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బోధన్,జహీరాబాద్, వరంగల్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, నిర్మల్, ముధోల్, షాద్ నగర్, మహబూబ్ నగర్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, బాన్సువాడ, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలలో మైనారిటీలు అక్కడి జయాపజయాలను నిర్ణయించే అవకాశాలున్నవి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25అసెంబ్లీస్థానాల్లోనూ మైనారిటీలు బలంగా ఉన్నారు. ” ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫస్ట్ ఇన్నింగ్స్ సక్సెస్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం ఉన్నది. కేసీఆర్ తెలంగాణ పట్ల మంచి విజన్ ఉన్న నాయకుడు. ఈ నాలుగేండ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన అభివృద్ధిని చూసే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌నుఢీకొనేసత్తాలేదు” అని ఒక సందర్భంలో అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీ రద్దుపై ప్రతిపక్షాలు విమర్శించినపుడు టిఆర్ఎస్ కన్నా ముందు వారిపై అసద్ కత్తి దూశారు. ”అసెంబ్లీని రద్దుచేసి పారిపోతున్నారంటూ విమర్శలు చేసేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తొమ్మిది నెలల ముందు అసెంబ్లీని రద్దుచేసేందుకు దమ్ము, ధైర్యం ఉండాలి. ఒక్కరోజు కూడా అధికారాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధపడరు. అలాంటిది తొమ్మిదినెలల ముందే అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం చరిత్రాత్మకం. రాష్ట్రంలో మైనార్టీల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకించి గురుకులాలు గత ప్రభుత్వాల పాలనలో ఎక్కడా కనిపించవు. కేసీఆర్ నాలుగేండ్ల పాలనలో ఏనాడూ మతఘర్షణలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అద్భుత పాలన చూస్తున్నాము. ఇక ముందు కూడా ఆయనతో దోస్తీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను అంటరానివారుగా చూస్తూ ఉన్నది.అధికారం లేకపోయినా కాంగ్రెస్ నేతల్లో గర్వం, అహంకారం తగ్గలేదు”. అనిహైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ఓవైసీటిఆర్తెఎస్ పట్ల, కేసీఆర్ పట్ల తన భక్తిని మరో సందర్భంలో చాటుకున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పైఆయ‌నప్రశంస‌లు గుప్పిస్తున్నారు. హైద‌రాబాద్ఇలాకాగా ఉన్న మ‌జ్లిస్ పార్టీ గ‌తకొద్దికాలంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో స‌ఖ్య‌త‌గా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. “తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతకాలం ఇక్క‌డ టిఆర్ఎస్ దే అధికారం. తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలు కనడం, గెలుస్తామని ఆశపడటం బీజేపీ మరిచిపోవాలి. రాబోయే రోజుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కాపాడుకోవడమే బీజేపీకి కష్టం“ అని మజ్లిస్ మహాశయుడు ఓవైసీ’ట్విట్టర్’ సందేశాలు ఇస్తూనే ఉన్నారు. ”నా పార్లమెంటు నియోజకవర్గంలో డ‌బుల్బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదించడంతో సంతోషం పట్టలేకపోతున్నా. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. ఫ‌రూక్‌న‌గ‌ర్‌లోని6ఎక‌రాల పోలీస్ స్థ‌లంలోడ‌బుల్బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు అంగీక‌రించ‌డంసంతోష‌క‌రం. ఫ‌ల‌క్‌నుమాబ‌స్టాప్‌ను ప్రారంభించే స‌మ‌యంలోడ‌బుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం విష‌యాన్నిప్ర‌స్తావించాను. ప్ర‌భుత్వంవెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కుజీహెచ్ఎంసీక‌మిష‌నర్క్షేత్ర‌స్థాయిలోప‌ర్య‌వేక్షించారు. చాలా వేగంగా ప‌నిచేస్తున్నస‌ర్కారు ఇది“ అని ఇంకో సారి ప్ర‌శంసల జడివాన కురిపించారు.

అస‌ద్, లేదా మజ్లిస్ పార్టీ నాయకులు కోరిన వెంటనే పనులవుతున్నవి. ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్నారు.ఎంఐఎం పనులను చేపట్టడం కేసీఆర్, కేటీఆర్లకు టాప్ ప్రయారిటీ అంశం. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ను అసదుద్దీన్ కీర్తించని రోజు దాదాపు లేదు. షెడ్యూలు కన్నా 9 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేయడం కేసీఆర్ చేసిన ‘గొప్ప త్యాగం’ గా ఆయన అభివర్ణించారు. పేద ముస్లిం మహిళల వివాహం కోసం ఆర్థిక చేయూత అందించేందుకు షాదీ ముబారక్ స్కీంలు ప్రవేశపెట్టారని కొనియాడారు. టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపిన అసదుద్దీన్.. కాంగ్రెస్‌పై మాత్రం విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలు కనిపించడం లేదన్నారు. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఎక్కువని చెప్పారు. కాగా, అసదుద్దీన్ ఒవైసీ తనంతట తానుగా నాకు ఫోన్ చేసి మద్దతు ఇస్తానన్నారని.. పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సందర్భంలో కేసీఆర్ ప్రస్తావించారు. ఎంఐఎం తమకు ఫ్రెండ్లీ పార్టీ అని, వారితో కలిసి స్నేహ పూర్వకంగా పని చేస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మజ్లిస్‌తో కలిసి ఉండాలనుకుంటే టీఆర్ఎస్‌తో స్నేహం ఉండదని బీజేపీ అధ్యక్షుడే తనకు చెప్పారని కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్, టిడిపి పొత్తులను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నందున మజ్లిస్ కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నది. ”ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనలేకే పొత్తు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుంది ? తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడకు పోయింది ?” అని అసద్ ప్రశ్నలు గుప్పించారు. ”టీడీపీ, కాంగ్రెస్ పొత్తును ప్రజలు ఆమోదించరు. తిప్పికొడతారు. ఏపీ సీఎంగా నాలుగేళ్లు ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు. పొత్తుల వల్ల కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలు నిండా మునుగుతాయి” అన్నది మజ్లిస్ అధినేత విశ్లేషణ. ”ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలవనుంది. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు” అని కూడా అసద్ జోస్యం చెప్పేశారు. ”మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారోముస్లింలకు స్పష్టంచేయాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇచ్చినందుకా? నాలుగున్నరేళ్లపాటు ముస్లింలను మభ్యపెట్టి మోసం చేసినందుకా?. అసదుద్దీన్‌ స్వప్రయోజనాల కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. తన తమ్ముడుపై ఉన్న కేసుల ఉపసంహరణ, రూ.40 కోట్ల విలువైన భూమిని నాలుగు కోట్లకు అప్పనంగా ఇస్తున్నందుకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. కేసీఆర్‌ మోదీకి ఏజెంట్‌, కేసీఆర్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్లే. ఢిల్లీలో పెద్ద మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ చోటా మోదీ. ముస్లింలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుండటంతో మజ్లిస్‌ నిజస్వరూపం బహిర్గతమైనది. టీఆర్‌ఎస్‌ అనేక విషయాల్లో కేంద్రంలో బీజేపీకిమద్దతిస్తూ వస్తోందని, నాలుగేళ్ల పాలనలో ముస్లింలకు జరిగిన న్యాయమేమిటి? నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో కూడా కేసీఆర్‌ బీజేపీకి బాహాటంగా మద్ధతు ప్రకటించారు” అనిటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి వేర్వేరు సందర్భాలలో ఆరోపణలు చేశారు. రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు, విమర్శలు పక్కనబెడితే ముస్లిం మైనారిటీలకు కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజలకు టిఆర్ఎస్ ‘ప్రవక్త’ గా అసదుద్దీన్ జవాబు చెప్పవలసి ఉన్నది. 1. ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రిజర్వేషన్‌ సాధన కోసం ప్రధానితో మాట్లాడానని, పార్లమెంట్‌ను కదిలిస్తానని, ఢిల్లీలో ధర్నా చేస్తానని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కేసీఆర్ చెప్పారు. ఆ హామీ అమలు వ్యవహారంలో కనీసం పురోగతి లేదు. 2. వక్ఫ్‌బోర్డుకు అధికారాలు, వక్ఫ్‌ ఆక్రమణ భూములు స్వాధీనం చేసుకుంటామని వాగ్ధానంచేశారు. కనీసం ఒక గజం భూమిని కూడా స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు.3. ముస్లింలకు కేటాయించిన బడ్జెట్‌లో సగంకూడా ఖర్చు చేయలేడు.4. కేంద్రం మైనారిటీ సంక్షేమ నిధులు తగ్గించినా కనీసం నోరు మెదపలేదు. 5.టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో సుమారు 90 శాతం మైనారిటీ కాలేజీలు మూతపడ్డాయి. 6. సుధీర్‌ కమిషన్‌ సిఫార్సులు ఒక్కటి కూడా అమలు చేయలేదు 7. ఒక ఉర్దూ ఉపాధ్యాయుడిని కూడా నియమించలేదు.8. ఆలేరు ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ సహా ఐదుగురు ముస్లిం యువకులు మరణించారు. అసలు ఏం జరిగిందన్న అంశంపై ఇప్పటిదాకా నివేదిక లేదు. 9. ఉర్డూ అకాడమీ పాలకమండలినిఅసెంబ్లీ రద్దుచేసే ఒక రోజు ముందు ఏర్పాటు చేశారు.10. ఇస్లామిక్‌ సెంటర్‌కోసం ఇప్పటివరకు పునాది రాయికూడా వేయలేదు. 11. అజ్మీర్‌లో రుబాత్, హైదరాబాద్‌లో అనీస్‌–ఉల్‌–గుర్బాలకు ఒక్క రూపాయికూడా విడుదల చేయలేదు. నాలుగు సంవత్సరాల బడ్జెట్లో ముస్లింలకు కేవలం 0.4 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. 12. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ బీజేపీతోజతకట్టదన్న గ్యారంటీ మజ్లీస్ఇస్తుందా? ఈ పన్నెండు అంశాలు ముస్లిం మైనారిటీల్లో బలంగా ప్రచారం జరుగుతున్నవి. కనుక టిఆర్ఎస్ ‘ప్రచారకుడు’ ఒవైసీ వీటన్నింటికీ ఎన్నికల ప్రచార సభలలో వివరణ ఇవ్వవలసి ఉంటుంది. 40 కోట్ల విలువైన భూమిని 4కోట్లకే ప్రభుత్వం మజ్లీస్ కు ఎందుకు ఇవ్వదలచుకున్నదో కూడా అసద్ చెప్పవలసి ఉన్నది. ప్రస్తుతం ఈ భూ ‘పందేరం’ ను హైకోర్టు నిలిపివేసింది. కానీ ప్రజలకు అనుమానాలున్నవి. ఎం.ఐ.ఎం నిష్కళంక పార్టీ అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయక తప్పదు.

మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సలహా మేరకే కేసీఆర్ ‘ముందస్తు’ ఎన్నికలకు వెళ్లారంటూ చాలా వార్తాకథనాలు ఆగస్టు చివరి నుంచి వెలువడుతూనే ఉన్నవి. ఒవైసీ, కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ల మధ్య ‘విరబూసిన స్నేహ బంధం ‘వల్ల ఆ కథనాలను నమ్ముతున్న వారిలో జనం ఉన్నారు. రాజకీయ పక్షాలూ ఉన్నవి. అధికారంలో ఉన్న రాజకీయపార్టీ మళ్ళీ అధికారంలోకి ప్రతి సీటును, ప్రతి ఓటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అంది వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. మజ్లిస్ పార్టీ తెలంగాణలో బలమైన రాజకీయ శక్తి ఏమీ కాదు. ఆ మాటకొస్తే పూర్తిగా హైదరాబాద్ కు పరిమితమైన పార్టీగా కుదించుకుపోయింది. అయితే రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయిలోను ముస్లిం మైనారిటీల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా, ముస్లిం ల గొంతుక గా మజ్లిస్ కు గుర్తింపు ఉన్నది. తెలంగాణలోని ముస్లిం ఓటర్ల ప్రభావిత ప్రాంతాల్లో టిఆర్ఎస్ కు ఒక ‘మిత్రుడు’ అవసరం. ఆ రూపంలో మజ్లిస్ పార్టీ కేసీఆర్ కు దొరికింది. కేసీఆర్ పై ఈగ వాలినా కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలపై అసదుద్దీన్ ఒవైసీ ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులపై ఆయన చిచ్చరపిడుగులా మాటల ‘దాడులకు’ దిగుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన అసద్ ‘ప్రచారకుని’ గా మారబోతున్నారు. ”కేసీఆర్ కు తిరుగు లేదు. అయన మళ్ళీ అధికారంలోకి రావడం తధ్యం. కాంగ్రెస్ చిత్తు ఆవుతుంది.” అంటూబహుశా అసద్ ప్రసంగాలు మనం వినవచ్చును.