కేసీఆర్ ఫామ్ హౌజ్ లో వేల కోట్ల డంప్. – డీకే. అరుణ.

హైదరాబాద్:
కేసీఆర్ ఫామ్ హౌస్ లో వేల కోట్ల కేసీఆర్ డంపు ఉన్నట్టు మాజీ మంత్రి డీకే. అరుణ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇంటిపై ఈడీ ,ఐటీ దాడులు ముమ్మాటికీ రాజకీయ కక్షనే అని అన్నారు.కేసులతో కాంగ్రెస్ నేతలను భయపెట్టాలనుకోవడం కేసీఆర్ భ్రమ అని చెప్పారు. కేసీఆర్ దివాలాకోరు రాజకీయాలకు ప్రజలు అంతం పలుకుతారని ఆమె అన్నారు.
ఈడీ దాడులు జరగాల్సింది కేసీఆర్ ఫామ్ హౌస్ ,టీఆరెస్ మంత్రులు ,ఎమ్మెల్యేల ఇండ్లపైన అని డీకే చెప్పారు. ఎన్నికల్లో భారీగా డబ్బులను పంచేందుకు ఇప్పడికే టీఆరెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ డబ్బులు పంపారని అరుణ తెలిపారు.
ప్రతి పక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆమె ఆరోపించారు.