కొండగట్టు బాధితులకు చెల్లని చెక్కులు!!.

జగిత్యాల:

కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు చెల్లని చెక్కులు పంపిణీ చేయడం వివాదాస్పదమైనది. ఆర్టీసీ చరిత్రలోనే అతి పేద్ద ప్రమాదంగా నిలచిన కొండగట్టు ప్రమాదం లో 62మంది చనిపోగా కనీసం పరామర్శకు రాని ముఖ్యమంత్రి ఇప్పుడు చనిపోయిన భాదీత కుటుంబాలకి డబ్బులు లేని చేక్కులు పంచారని బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన చేక్కులు బ్యాంక్ లొ డిపాజీట్ చేయ్యగా చేక్ బౌన్స్ అయ్యాయి. ఈ విషయంపై అర్డీవోను వివరణ కోరగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించారు. భాదీతులు ధర్నా చేశారు. అక్కడికి వచ్చిన పోలిసులు కూడా “మీ గొంతమ్మ కొరికలు తీర్చడానికి అర్డివో కి, కలేక్టర్ కి వేరే పని ఉండదా” అనడంతో భాదీత కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.