కొడంగల్ అభివృద్ధికి టీయారేస్ ను దీవించండి. కోస్గి బహిరంగసభలో హరీష్ రావు.

వికారాబాద్:
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడంగల్ పై టీయారెస్ జెండా ఎగురుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆరెస్ ను దీవించవలసిందిగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా కోస్గిలో బహిరంగసభలో మంత్రి మాట్లాడారు.ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టి గెలిచాడని అన్నారు. కొడంగల్ కు బస్సు డిపో సాదించిన ఘనత ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, గుర్నాద్ రెడ్డిదేనని హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యే గా ఉండి ఫైర్ స్టేషన్ ను తీసుకురాలేకపోయినట్టు హరీశ్ రావు విమర్శించారు.కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకా ఎరువులు, విత్తనాల కొరత లేదని చెప్పారు. రైతుల మీద ప్రేమతో ‘రైతుబందు’ పధకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
కేసియార్ ఉన్నంత వరకు రైతులకు పంట పెట్టుబడి వస్తుందన్నారు.పక్క రాష్ట్రంలో ఉన్నవారు మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన తెలంగాణలో కలుస్తం అంటున్నారని గుర్తు చేశారు.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి‌మంచి నీరు అందిస్తున్నట్టు తెలిపారు.పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇక్కడి ప్రజలకు నీరందించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి అడ్డుకుందని హరీశ్ ఆరోపించారు.అభివృద్ధి నిరోదకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
బీమా, నెట్టంపాడు ద్వారా కొడంగల్, నారాయణ్ పేట్ కు నీరందించడం సాద్యం కాదన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరొస్తుందన్నారు.దండోని చెరువుకు‌ నీరు తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటామని తెలిపారు.కొడంగల్, కోస్గీలో 50 పడకల దవాఖానను తెచ్చుకున్నట్టు చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గంలో 184cr తో పనులు జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు.కొడంగల్ నియోజకవర్గంకు పది సబ్ స్టేషన్ లు‌ మంజూరు చేసామని వివరించారు.1800 తండాలను గ్రామ పంచాయితీ లు గా మార్చామని చెప్పారు.
బొమ్మరాస్ పేట్, దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజీలను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.మరో పదిహేను సంవత్సరాలు టీయారెస్ ప్రభుత్వమే అదికారంలో ఉంటుందన్నారు.ప్రజల ఆశీర్వాదం తో పాలమూరు ప్రాజెక్టు ను పూర్తి చేసి రుణం తీర్చుకుంటామన్నారు.ఆగస్ట్ 15 నుండి ‘కంటి వెలుగు’ ప్రారంభం అవుతుంది. పరిక్షలు చేసి అవసరమైతే ఆపరేషన్ లు చేస్తారని హరీశ్ రావు తెలిపారు.