‘కోడ్’ ఉల్లంఘనపై ‘ప్రజాకూటమి’ ఫిర్యాదు.

హైదరాబాద్:

ప్రజా కూటమి నేతల పోన్ లను ట్యాప్ చేతున్నారని ,నేతల వాహనాలను ఉద్దేశ్య పూర్వకంగా పదే పదే తనిఖీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజత్ కుమార్ కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జనసమితి నేత దిలీప్ కుమార్ ఫి ర్యాదు చేశారు.”మహా కూటమిలో భాగమైన పార్టీలు కలిసి సీఈఓతో సమావేశం అయ్యి పలు అంశాలపై ఫిర్యాదు చేశాం.వ్యక్తిగతంగా నేతలను ఇబ్బంది పెట్టేలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు.కేసీఆర్ బంధువు, టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎల్ రమణ ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి ఇబ్బంది పెట్టారు. ఆయన పై అక్రమంగా కేసులు పెట్టే కుట్ర జరుగుతోంది.

జన సమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇదే విధమైన అడ్డంకులు సృష్టించారు.ఇంటలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్న విషయాన్ని సీఈఓ దృష్టికి తీసుకెళ్లాము. స్పందించిన సీఈఓ పోలీసు ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటా మన్నారు.టి న్యూస్ ,నమస్తే తెలంగాణ పేపర్ లు రాజకీయ పార్టీల కరపత్రాల మాదిరిగా మారి కోడ్ ను ఉల్లంగిస్తున్నాయి.మాపై అనవరమైన ఆరోపణలు చేస్తున్నారు.2014లో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది మీడియా అనేది అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి.ప్రభుత్వ ఆస్తులపై కేసీఆర్ బొమ్మతో ప్రచారం జరుగుతోంది.మెట్రో రైలు పై ఇంకా సీఎం కేసీఆర్ ఫొటో తో ప్రచారం చేస్తున్నారు. ఇది కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది చర్యలు తీసుకోవాలని కోరాం.సీఎం అధికార నివాసం, మంత్రుల నివాసంలో, క్లబ్ హౌస్లో యథేచ్ఛగా రాజకీయ పార్టీల సమావేశాలు జరుగుతున్నాయి. ఇది కోడ్ ఉల్లంఘనే.కేసీఆర్ సీఎం అయినప్పటి నుంచి పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతల హక్కులను హరిస్తున్నారు” అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆరోపించారు.”కేసీఆర్ అధర్మంగా వ్యవహరిస్తున్నారు.మహా కూటమి ఏర్పాటును కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు.నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.నాపై, నా అనుయాయులపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు.

కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.

కేసులకు భయపడే రకం నేను, మహా కూటమి కాదు.కేసీఆర్ దుర్మార్గ పాలనలో కొండగట్టు ప్రమాదం లో 64 మంది చనిపోతే వారికి బాధిత కుటుంబాలకు నా అభిమానులు, స్నేహితుల ద్వారా ఒక్కో కుటుంబం కు 25 వేలు ఆర్ధిక సహాయం చేశాను కానీ కేసీఆర్ కనీసం పరమర్శించలేదు.మానవత్వం లేని మనిషి కేసీఆర్.కేసీఆర్ ను గద్దెదించే వరకు మేము వదిలి పెట్టము.కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది.వెయ్యి కోట్లు కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి కలుస్తాం.అప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయి” అని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు.”కేసీఆర్ ప్రతిపక్ష లను ఇప్పటి వరకు టార్గెట్ చేశాడు. ఇప్పుడు మహా కూటమిని టార్గెట్ చేశాడు.ఎప్పటికైనా మహాకూటమే తనను గద్దె దించుతారని భయపడుతున్నారు.అధికారులు కేసీఆర్ కనుసన్నల్లోనే పని చేస్తున్నారు.తప్పుడు పద్ధతుల్లో అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారు” అని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ చెప్పారు.”పోలీసులు కేసీఆర్ కు తాబేదారు లుగా వ్యవహరిస్తున్నారు.కోదండరాం లాంటి వ్యక్తులకు నిఘా పెట్టడం దుర్మార్గపు ఆలోచన.

ఎన్నికల కమిషన్ ఆధీనంలో ప్రభుత్వ అధికారులు పని చేయాలని గుర్తు పెట్టుకోవాలి. స్వయంగా హోమ్ మినిస్టర్ వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తాడు సీఎం అని అన్నాడు దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈఓ ను కోరాం” అని తెలంగాణ జన సమితి నాయకుడు కపిల వాయి దిలీప్ చెప్పారు.