‘కోడ్’ ఉల్లంఘించిన కళాకారుల సస్పెన్షన్!

కరీంనగర్:

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎనిమిది మంది సాంస్కృతిక సారధి కళాకారులను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ రద్దయిన నాటినుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ముందస్తు అనుమతి లేకుండా సెప్టెంబర్-30న టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్ధానిక భగత్నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో కొందరు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. అధికారుల నివేదిక ఆధారంగా ఎ శంకర్, డి.మురళీగౌడ్, పి. శ్రావణ్, కె.శ్రీలత, పి.అర్చన, సీహెచ్.రాధ, సాయిలా శ్రీనివాస్, వి.సుధీర్ ను సస్పెండ్ చేశామన్నారు