కోదండరామ్‌కు డిప్యూటీ సీఎం ర్యాంక్‌ పదవి!

హైదరాబాద్:

‘మహాకూటమి’ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ వేగం పెంచింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపేందుకు కమిటీ వేశారు. జానారెడ్డి, చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, వినయ్‌తో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కోర్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కోదండరామ్ పోటీ చేయకుండా ప్రచారం చేస్తే కూటమికి లాభం జరుగుతుందని నేతలు భావిస్తున్నారు. జనసమితికి టికెట్లు కేటాయించినా కాంగ్రెస్‌ గుర్తుపైనే పోటీ చేస్తే బాగుంటుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త గుర్తు అయితే ప్రజలు అయోమయానికి గురవుతారని భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం ర్యాంక్‌తో కూడిన పదవిని కోదండరామ్‌కు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.