కోమటిరెడ్డికి చెలగాటం- జానాకు ప్రాణ సంకటం.ఒకరిది ఆవేశం, మరొకరిది అపార అనుభవం.

శాసనసభ్యులంతా రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలంటున్న డిమాండ్ మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి చెలగాటంగా ఉంది.కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, ప్రతిపక్షనేత జానారెడ్డికి మాత్రం సంకటంగా మారింది. సిఎల్పి నేతగా తమను కాపాడుకోవలసిన  భారం జానాదే నని కోమటిరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.జానారెడ్డి తో పాటు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన ఇరకాటంలోకి నెట్టారు.పార్టీ నాయకులతో చర్చించి కాంగ్రెస్ శాసనసభ్యులంతా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవాలన్నది వెంకటరెడ్డి ప్రతిపాదన.ఈ ప్రతిపాదనకు ముందూ, వెనుక అనేక రాజకీయ కోణాలున్నాయి.శాసనసభ్యులు రాజీనామా చేయాలని, ఉపఎన్నికలకు వెళ్లాలని ఇదివరకే అనుకున్నట్టు కోమటిరెడ్డి చెబుతుండగా, రాజీనామాల ప్రస్తావనే రాలేదని జానారెడ్డి కొట్టిపారేశారు.ఎవరు నిజం మాట్లాడుతున్నారో ?
హైదరాబాద్;
కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి,సంపత్ ల శాసనసభ్యత్వాల పునరుద్ధరణపై ప్రభుత్వం శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం.ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఆ నిర్ణయం ఉండవచ్చు.స్పీకర్ విచక్షణాధికారాలను ఎవరూ ప్రశ్నించలేరు.ఈ సమస్య ఇలాగే కొనసాగుతుందా?ఈ ప్రతిష్టంభనను ప్రభుత్వం ఇలాగే కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి కధనం ప్రకారం హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళదు.అలాగని ఎలాంటి నిర్ణయమూ తీసుకోదు.కానీ కాంగ్రెస్ నాయకుల మధ్య కొత్త వైరానికి ఈ అంశం తెరలేపింది.కాంగ్రెస్ శాసన సభ్యులంతా రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో తలపడవచ్చునన్నది కోమటిరెడ్డి వాదన. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా, లేదా అన్న మీమాంస లో సీనియర్లు కనిపిస్తున్నారు.మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.ఈ లోగా ఉపఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు,ఇవ్వకపోవచ్చు. ఎం.ఎల్.ఏ సీటు ఖాళీ అయిన 6 నెలల్లో ఎన్నికలు జరపడం సాధారణ విషయం. నల్లగొండ,ఆలంపూర్ శాసనసభ స్థానాలు ఖాళీ అయ్యాయంటూ ఎన్నికల కమిషన్ కు గత మార్చిలోనే సమాచారం వెళ్ళింది.ఈ లోగా కోమటిరెడ్డి,సంపత్ హైకోర్టుకు వెళ్లారు.ప్రతివాదులుగా ఎన్నికలకమిషన్, ప్రభుత్వాన్ని చేర్చారు.కోర్టులో వారికి ఊరట లభించింది.హైకోర్టుకు వెళ్ళకుండా ఉంటె బహుశా ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో తెలిసే అవకాశం ఉండేది.శాసనసభ్యులంతా రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలంటున్న డిమాండ్ మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి చెలగాటంగా ఉంది.కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు, ప్రతిపక్షనేత జానారెడ్డికి మాత్రం సంకటంగా మారింది. సిఎల్పి నేతగా తమను కాపాడుకోవలసిన  భారం జానాదే నని కోమటిరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు.జానారెడ్డి తో పాటు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన ఇరకాటంలోకి నెట్టారు.పార్టీ నాయకులతో చర్చించి కాంగ్రెస్ శాసనసభ్యులంతా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోవాలన్నది వెంకటరెడ్డి ప్రతిపాదన.ఈ ప్రతిపాదనకు ముందూ, వెనుక అనేక రాజకీయ కోణాలున్నాయి.శాసనసభ్యులు రాజీనామా చేయాలని, ఉపఎన్నికలకు వెళ్లాలని ఇదివరకే అనుకున్నట్టు కోమటిరెడ్డి చెబుతుండగా, రాజీనామాల ప్రస్తావనే రాలేదని జానారెడ్డి కొట్టిపారేశారు.ఎవరు నిజం మాట్లాడుతున్నారో ? తెలియదు.జానారెడ్డి అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు.ఆచి,తూచి వ్యవహారం చేయడం ఆయన స్టైల్.రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడం ‘సాహసం’తో కూడుకున్నదే గాక ‘ప్రమాదకరమైనదని’ కూడా జానారెడ్డి కి తెలుసు.అందువల్ల ఆయన ఉపఎన్నికల పోరాటాలకు సుముఖంగా ఉండకపోవచ్చు.కోమటిరెడ్డి వలె జానారెడ్డి దూకుడుగా ఆలోచనలు చేయలేరు,నిర్ణయాలు చేయడం అంతకన్నా సాధ్యం కాదు.
కేసీఆర్ పలు మార్లు రాజీనామా చేయలేదా అని కోమటిరెడ్డి గుర్తు చేశారు.రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి గురిపెట్టి ఆరోపణలు సంధించారు. రాజీనామాల పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.  ఉప ఎన్నికల్లో టిఆరెస్ తో తేల్చుకోగలిగితే సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాదన.రేపటి లోగా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.తాము తమ వ్యక్తిగత పబ్లిసిటీ కోసం సభలో ఆందోళన చేయలేదని కోమటిరెడ్డి అన్నారు. అందరం రాజీనామా చేయాలని ఇంతకుముందు అనుకున్నామని చెబుతున్నారు. ఇప్పుడైనా రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఆయన టిపిసిసి, సిఎల్పి లపై ఒత్తిడి పెంచారు. అయితే సిఎల్ పి నాయకుడు జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
రాజీనామా చేస్తామనే అంశం తన దృష్టికి తేలేదని ఆయన మీడియాకు తెలిపారు.అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను ముందు ఉండి నడిపిస్తానని చట్టసభల్లో అపార అనుభవం గడించిన జానారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామాల అంశం కోమటిరెడ్డి తనతో ఎప్పుడు చర్చించలేదన్నారు. రాజీనామా అంశం కోమటిరెడ్డి తనతో చెప్పినట్టు రుజువు చేయాలని జానారెడ్డి సవాలు చేశారు. పార్టీ సభ్యులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉంటే తాను ఎందుకు నిలువరిస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంటున్నారు.ముందుగా ఇలాంటి విషయాలు పార్టీలో చర్చ జరగాలని,నిర్ణయం తీసుకున్న తర్వాతా అధిష్టానానికి తెలియజేయవలసి ఉంటుందన్నారు.త్యాగాలకు వెనుకాడనని, తానే ముందుంటానని కూడా స్పష్టం చేశారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన అర్థం చేసుకున్నానని, తప్పు పట్టడం లేదని జానారెడ్డి చెప్పారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి,సంపత్ కుమార్ శాసనసభ్యత్వాల రద్దుపై చట్టపరమైన పోరాటానికి గాను అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇంత కంటే ఎక్కువ ఏం చేయాలో పార్టీలో చర్చిస్తామని జానా చెప్పారు. కోమటిరెడ్డి,సంపత్ ల శాసనసభ్యత్వాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు నేపథ్యంలో సీఎం కెసిఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని టిపిసిసి అద్ఫ్హ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని పదే పదే చెపుతున్నామని అన్నారు.శాసన సభలో ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించి మిగతా వాళ్ళను సస్పెండ్ చేశారని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటిది జరగలేదన్నారు.ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను ఎలా బహిష్కరిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు.ఏ సందర్భంలో అడ్వకెట్ జనరల్ రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని టిపిసిసి అధ్యక్షుడు కోరారు.శ్శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టిఆర్ ఎస్ శాసనసభ్యులు కోర్టులో పిటిషన్ వేయడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ తప్పుబట్టిందన్నారు.తెలంగాణాలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ జరుగుతున్నదో అర్థమవుతున్నట్టు మరో సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ చర్యను హై కోర్ట్ కొట్టేసిందని, ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్ళదాని, హై కోర్ట్ తీర్పు ను అమలుచేయదని అయన అన్నారు. తాను చేసింది రాజ్యాంగ విరుద్ధమని కెసిఆర్ కు కూడా తెలుసన్నారు.అందుకే అప్పీల్ కు వెళ్లడంలేదన్నారు.ఇలాంటి పరిస్థితి 70 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు.
తెలంగాణాలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా?అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.