కోమటిరెడ్డి బ్రదర్స్ కు షాక్! ‘కారె’క్కిన ‘అలుగుబెల్లి.

రవి, నల్లగొండ:
కోమటిరెడ్డి బ్రదర్స్ కు మరో షాక్ తగిలింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు మాజీ జడ్పీటిసి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. నల్గొండ,నకిరేకల్ నియోజకవర్గాలలో సమీకరణాలు మారనున్నవి. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశంల అద్వర్యంలో టిఆర్ఎస్ లో మాజీ జడ్. పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి చేరారు.అనుచరులతో సహా హైదరాబాద్ తెలంగాణభవన్ కు అలుగుబెల్లి అనుచరులు భారీగా తరలివచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మాజీ జడ్.పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి హస్తానికి ‘చే’యిచ్చి కారు ఎక్కారు.గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన ఆయన తదుపరి నార్కెట్పల్లి జడ్.పి.టి.సి గా ఎన్నికయ్యారు. రవీందర్ రెడ్డి తండ్రి హనుమంత రెడ్డి సుదీర్ఘ కాలం స్వగ్రామం నేమ్మాని గ్రామ సర్పంచ్ గా వ్యవరించారు.నల్గొండ నియోజకవర్గ పరిధిలో నార్కెట్ పల్లి, చిట్యాల మండలాలు కలిసి ఉన్నప్పుడు దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరులుగా వ్యవరించారు. రవీందర్ రెడ్డి కుటుంబం కొంత కాలం స్థబ్దత గా ఉన్నారు. 1998 ప్రాంతంలో అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి కి నియోజకవర్గ పరిధిలో అంతంత మాత్రంగా పరిచయాలు ఉండడం తో అలుగుబెల్లి అన్నీ తానై ఆయన సాధించిన వరుస విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 2009 కాలంలో రాజకీయ అరంగ్రేటం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోకసభ కు పోటీ చేసినప్పుడు కూడా అలుగుబెల్లి రవీందర్ రెడ్డి ముందుండి పాతకాపులను కొత్త కాపులను ఒక్క తాటి మీదకు తెచ్చి ఆయన విజయంలోను ముఖ్య భూమిక పోషించారు.ఈ క్రమంలో ఆయన టిఆర్ యస్ శ్రేణులకు చేరువ అయ్యారు. నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశంతో అలుగుబెల్లి సాన్నిహిత్యం ఉన్నది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తో సంబంధాలు ఉండడంతో ఆయన టి ఆర్ యస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో వారం రోజుల్లో నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరుగుతున్న నేపద్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత అలుగుబెల్లి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరడం చర్చినీయాంశంగా మారింది.