క్వారీలో పేలుడు.9 మంది దుర్మరణం.

కర్నూలు:
మైనింగ్ క్వారీలో పేలుడు సమయంలో బండరాళ్లు మీద పడి 9 మంది మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఆలూరు మండలం అగ్రహారం దగ్గర చోటు చేసుకుంది. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులంతా ఒడిశా వాసులుగా గుర్తించారు. పేలుడు వల్ల భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయబ్రాంతులుకు గురైయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.