క్వీన్ ఆఫ్ గుడ్ టైమ్స్.. సానియా !!

హైదరాబాద్:

భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కోర్టులో తన ఆటతోనే కాకుండా గ్లామర్ క్వీన్ గా గుర్తింపు పొందింది సానియా. ఇంటర్వ్యూలలో తన వన్ లైనర్లతో పంచ్ లు విసిరే టెన్నిస్ ఏస్ తల్లి కాబోతోంది. ఆట నుంచి కొద్దికాలం విరామం తీసుకున్న సానియా, ప్రస్తుతం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఖుషీగా కాలం గడుపుతోంది. నిన్న తన ఇంట్లో రామ్ చరణ్ తేజ్ ఫ్యామిలీ, ఇతర స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నప్పటి ఫోటోని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. నాన్ స్టాప్ నవ్వులతో భలే సరదాగా గడిచిందని సానియా ట్వీట్ చేస్తే రామ్ చరణ్, అతని భార్య ఉపాసన అవునని, చాలా బాగున్నట్టు ఎమోజీలు పెట్టారు.