ఖతార్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

ఖతర్:
తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి ఖతర్ నాయకురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత ఆశయాలకు అనుగునంగా తెలంగాణా NRI లు బంగారు తెలంగాణ నిర్మాణం లో పాలు పంచుకుంటాం అని ప్రతిజ్ఞ చేసారు.ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులు ఎవరు అధైర్య పడి ఆత్మ హత్య లు చేసుకోవద్దని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ నాయకులు ప్రణీత కేతే, వినాయక్ చెన్నా, అశ్వినీ కోటి, అనుపమ సంగిశెట్టి, శ్రీధర్ అబ్బగౌని మరియు ఇతరులు పాల్గొన్నారు.అనంతరం రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.