ఖమ్మంలో టిఆర్ఎస్ కార్పొరేటర్ల తిరుగుబాటు:

ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్ లో అధికార టీఆర్ఎస్ లో ముదురుతున్న వివాదం. మేయర్, కమిషనర్ ల తీరుపై అధికార కార్పొరేటర్ల తీవ్ర అసంతృప్తి.
మేయర్ ను మార్చి, కమిషనర్ ను బదిలీ చేసే వరకు కార్పొరేషన్ కార్యక్రమాలకు హాజరు కావద్దని నిర్ణయం.36 మంది టి ఆర్ ఎస్ ఖమ్మం నగర కార్పొరేటర్ల అత్యవసర రహస్య సమావేశంలో మూకుమ్మడి నిర్ణయం.
ఎమ్మెల్యే, మంత్రి ని , ఎంపీ, ఎమ్మెల్సీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయం.ఖమ్మం నగరంలోని శ్రీనివాస నగర్ లో ఓ ఫంక్షన్ హాల్ లో 36 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ల రహస్య సమావేశం నిర్వహించారు.దాదాపు3 గంటల పాటు సాగిన సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కార్పొరేటర్లు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతో కలిసి మేయర్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డివిజన్ల పర్యటనకు సంబంధిత కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వకుండా వెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మేయర్ తీరు మార్చుకోక పోతే మూకుమ్మడి గా రాజీనామాలు చేయాలని సమావేశంలో తీర్మానం కూడా చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకోసం 10మంది కార్పొరేటర్లతో కార్యాచరణ కమిటీ ఏర్పాటు కూడా ఏర్పాటు చేశారు.