ఖమ్మంలో 10 కి 10 స్వీప్: -ఎంపీ పొంగులేటి.

ఖమ్మం:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో విబేధాలు లేవని, అందరం కలిసి పనిచేస్తున్నామని ఆయన అన్నారు.10 స్థానాల అభ్యర్థుల గెలుపు కోసం జిల్లాలో ఉండే ముఖ్య నాయకులందరం పనిచేస్తూ కేసీఆర్ ఆదేశానుసారం 10 కి 10 గెలిపించే బాధ్యతను తీసుకుని, ఆ దిశలో పయనిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 10 జిల్లాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి చేసిందీ, పల్లె పల్లెకు తిరుగుతూ ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.