ఖమ్మం కార్పొరేషన్ లో ముసలం.

రాష్ట్ర రాజదానికి చేరిన ఖమ్మం గులాబీ పోరు..
ముఖ్యమంత్రితో అమీతుమీ.
సిద్దమైన కార్పోరేటర్లు.
మేయర్ మార్పు.
కమీషనర్ బదిలీ ప్రధాన డిమాండ్.
ఖమ్మం:
మేయర్ ను మార్చాలని, కమిషనర్ ను బదిలీ చేయాలని కోరుతూ 32 మంది
ఖమ్మం కార్పొరేటర్లు హైదరాబాద్ చేరుకున్నారు.
మూకుమ్మడి రాజీనామాస్త్రంతో తిరుబాటు చేసేందుకు ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ చేరిన ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్- అధికార పార్టీ కార్పొరేటర్ల పంచాయతీ. మేయర్, కమిషనర్ తీరుపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్ చేరుకున్నారు.మంత్రి కేటీఆర్ తో కార్పొరేటర్లు సమావేశం కానున్నారు.హైదరాబాద్ కు ప్రత్యేక వాహనాల్లో 32 మంది కార్పొరేటర్లు చేరుకున్నారు.మొదట తమ డిమాండ్ల ను హైదరాబాద్ లోనే ఉన్న మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే అజయ్ ల దృష్టి కి ఖమ్మం టీఆర్ఎస్ కార్పోరేటర్లుతీసుకు రానున్నారు.