గంగాధర రాజకీయం గరం.. గరం.. ఎం.పి.పి చైర్మన్ పై అవిశ్వాసానికి క్యాంపులు .

  • కిడ్నాప్ ఆరోపణలు,ప్రత్యారోపణలు.  

కరీంనగర్;
కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ రాజకీయాలు ఒక్కసారీగా వేడెక్కినాయి. కొంత కాలంగా‌ గంగాధర ఎంపిపి టి ఆర్ ఎస్ కు చెందిన దూలం బాలగౌడ్ పై నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపిటీసి లు ఎంపిపి పై అవిశ్వాసం పెట్టడానికి సిధ్ధమయ్యారు. శుక్రవారం నుంచి తొమ్మిది మంది ఎంపిటీసి లు క్యామ్పు కు వెళ్లారు. ఇందులో బిజేపికి చెందిన నలుగురు ఎంపిటీసి లు, కాంగ్రెస్ కి చెందిన ముగ్గురు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తో ఉన్నారు. అధికార పార్టీకి ఈ పరిణామాలు చెమటలు పట్టించాయి. తన తల్లిని‌ కిడ్నాప్ చెసారని తాడిజెర్రి ఎంపిటీసి మల్లవ్వ కొడుకుతో టిఆర్ ఎస్ నాయకులూ కరీంనగర్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపిటీసి మల్లవ్వ తనను ఎవ్వరు కిడ్నాప్ చెయ్యలేదని గంగాధర ఎంపిపి పై అవిశ్వాసం పెట్టడానికే ఇష్ట పూర్వకంగా వచ్చానని ‘వాట్సప్’ లో ఓ విడియో ను రిలిజ్ చేయించారు. మల్లవ్వ కొడుకే తన తల్లిని తీసుకెళ్ళి అప్పగించిన విడీయొ కుడా బయటికి వచ్చింది. గట్టుబుత్కూర్ కు చెందిన విజేందర్ రెడ్డి ఈ ‘క్యామ్పు’ రాజకీయాల్లో పాల్గొంటున్నాడని అధికార పార్టీ నాయకుల ఫిర్యాదు చెయ్యడంతో గంగాధర ఎస్సై పుల్లయ్య అతని తండ్రిని గంగాధర పొలిసులు తీసుకు వెళ్లారు. విచారణ పేరుతొ విజేందర్ రెడ్డి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.