గంగాస్నానం చేస్తుండగా గ్యాంగ్‌రేప్.

పాట్నా:

బీహార్ రాజధాని పాట్నాలో మానవత్వం సిగ్గుపడే సంఘటన వెలుగు చూసింది. జల్ గోవింద్ గ్రామం దగ్గర పవిత్ర గంగా స్నానం చేయడానికి వెళ్లిన 45 ఏళ్ల మహిళను అదే గ్రామానికి చెందిన యువకులు పట్టపగలు గ్యాంగ్ రేప్ చేశారు. అంతే కాకుండా నిందితులు తమ చర్యను వీడియో తీసి సోషల్ మీడియా పెట్టారు. వీడియో క్లిప్ వైరల్ గా మారడంతో పోలీసులకు ఈ దారుణం గురించి తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.ఆదివారం ఉదయం 11 గంటలకు బాధిత మహిళ స్నానం చేసేందుకు గంగానదిలో దిగింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గ్రామానికి చెందిన ఆకతాయి యువకుడు శివపూజన్ మహతో ఆమెను పట్టుకొని ఒడ్డుకి ఈడ్చుకొచ్చాడు. వైరల్ వీడియోలో బాధితురాలు ఉపవాసదీక్షలో ఉన్నానని.. పూజ చేయాలని వేడుకోవడం కనిపించింది. గంగమ్మ మీద ఒట్లు పెట్టింది. అయినప్పటికీ కరగని ఆ దుర్మార్గులు ఆమెను ఈడ్చుకెళ్తూ నోర్మూసుకోవాలని బూతులు తిట్టారు. ఒడ్డున, గంగానదిలో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు.పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని ఆమెను దుండగులు బెదిరించారు. ఈ వ్యవహారంలో రాజీ చేసుకొనే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఇంతలోనే రేప్ వీడియో వైరల్ అయి పోలీసులకు చేరింది. వెంటనే నిందితులు శివపూజన్ మహతో, విశాల్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు పలువురు మహిళలపై శివపూజన్ మహతో అత్యాచారం చేసినట్టు పోలీసు కేసులు ఉన్నాయి.