గంట పరిచయంతో కలిసి పడుకుంటారా? – బిగ్ బాస్ 2 నిష్క్రమణ కు గురైన సంజన.

హైదరాబాద్:
తనను ఒక పధకం ప్రకారం ‘బిగ్‌బాస్2’ నుంచి ఎలిమినేట్ చేశారని సంజన ఆరోపించారు. బిగ్‌బాస్ హౌస్‌లో తను ఎన్నో ఇబ్బందులకు గురయ్యానన్నారు.
తన అనుభవాలను ఒక టీవీ చానల్ కు చెప్పారు. తనను ‘జైల్లో’ ఒక అబ్బాయితో వేయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. అంతే కాకుండా అక్కడే అతడితో పాటు కలిసి నిద్రపోయే సందర్భం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘‘ఆ వ్యక్తికి వెనక్కి తిరిగి పడుకోండి, మధ్యలో తలగడలు పెట్టుకోండంటూ నాకు సలహాలు ఇచ్చారు. ఏదో గంట పరిచయమైన వ్యక్తితో ఒక రాత్రి ఎలా నిద్రపోతాం” అని వాపోయింది.