‘గట్టె’క్కిన ఆర్టీసీ మినీ బస్సులు.

జగిత్యాల:

కొండగట్టు ఘాట్ ప్రమాదంలో 62 మంది అమాయక ప్రజలు బలైన తరువాత కానీ ఆర్టీసీకి కనువిప్పు కలగలేదు. ఎట్టకేలకు కొండగట్టు అంజన్న స్వామి దర్శనానికి గాను ఆర్టీసీ గురువారం నుంచి ఉచిత మినీ బస్సులు ప్రవేశపెట్టినది.