గడ్చిరోలి,తూతుకుడి మారణకాండకు వ్యతిరేకంగా 9న సభ.

హైదరాబాద్:
ఏప్రిల్22,23న గడ్చిరోలి లో40 మందికి పైగా ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది. బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును హరించి వేస్తున్నది. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన ఆదివాసీ ఉద్యమాలను,స్టెరిలైట్ కంపెనీ వ్యతిరేక ఉద్యమాలపై ప్రభుత్వాలు పాశవిక దాడులను కొనసాగించాయి. ఈ దాడిలో 70 మందికి పైగా చనిపోయినట్టు ప్రభుత్వాలే చెబుతున్నాయి. ప్రజాస్వామికంగా నడవాల్సిన ప్రభుత్వాలు హత్య కాండలతో కొనసాగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా మరొకసారి ప్రజాస్వామ్యం గురించి ఆలోచించాలని,ప్రభుత్వాల దమనకాండకు వ్యతిరేకంగా జరుగుతున్న సభను ఈ నెల 9న సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే సభను విజయవంతం చేయాలని పౌర హక్కుల సంఘం
 విజ్ఞప్తిచేసింది.ప్రొ.హరగోపాల్,మహేష్(గడ్చిరోలి)
లాల్సు(అడ్వకేట్,అహిరి),జగదీష్ మెశ్రం(అడ్వకేట్ గడ్చిరోలి),
సోనిసోరి,వరవరరావు,శ్రేయ(డబ్ల్యూ.ఎస్. ఎస్)
గోపాల్(తమిళనాడు.సి.పి.డి.ఆర్),
ప్రొ. లక్ష్మణ్,చిలుక చంద్రశేఖర్,
నారాయణ రావు,రఘునాథ్,
సురేష్ కుమార్  పాల్గొంటారని పౌర హక్కుల సంఘం తెలిపింది.