గద్దర్ పై దాడి. ముగ్గురు సిపిఎం కార్యకర్తలకు గాయాలు.

సూర్యాపేట:
అధికారపక్షంలో అసహనం పెరుగుతున్నదా? గద్దర్ పై దాడికి పూనుకున్నదేవరు?
సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునగాల మండలం కలకొవ లో సీపీఎం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది .ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తున్న ప్రజాయుధ్ధ నౌక గద్దర్ పై రాళ్ళ దాడికి టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడ్డారు. వేదిక ముందున్న ముగ్గురు సీపీఎం కార్యకర్తలకు గాయాలయ్యాయి.టీఆర్ఎస్ కార్యకర్తల చర్యలపై గద్దర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుపాకి తూటాలకే తాను భయపడలేదన్నారు. రాళ్ల దాడికి భయపడే పిరికిపందను కానంటూ ఫైరయ్యారు. రాళ్లదాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని గద్దర్ డిమాండ్ చేశారు.