‘గద్వాల కోట’ ఎవరిది? డి.కె.అరుణ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, వెంకటాద్రి రెడ్డి మధ్య భీకర పోరు!

మహబూబ్ నగర్:
వచ్చే ఎన్నికల్లో గద్వాల లో భీకర పోరుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇద్దరి బలమైన అభ్యర్థుల మద్య పోటీ జరగినది. కాంగ్రెస్ పార్టీ తరఫున డి.కె.అరుణ గెలవగా స్వల్ప ఓట్లతో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఓటమి చెందారు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రిగా పనిచేసిన డి.కె.అరుణ మీద గట్టి పోటీ ఇచ్చిన బండ్ల ఈసారి కూడా డీకోనడనికి సిద్దమవుతున్నారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఈసారి గెలుపు ఖాయమని టీఆరెస్ నాయకులు అంటున్నారు.
కృష్ణ మోహన్ రెడ్డితో పాటుగా మరికొందరు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభలో తెరాసపార్టీ నుండి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేరు ప్రకటించారు. ఈసారి తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రజలు ఈసారి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన వర్గానికి చెందిన వారు చెబుతున్నారు.
అయితే తెరాస పార్టీకి చెందిన మరో వర్గం ఇన్నిరొజులు టికెట్ ఆశలో ఉండి టికెట్ రాదని నిరాశకు గురయ్యారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కి ఆ వర్గం మద్దతు ఇస్తుందా అనే సందేహాలు ఉన్నవి. తెరాసలో అన్ని వర్గాల వారు కలసికట్టుగా పనిచేస్తేనే అప్పుడు తెరాస విజయనికి మార్గం సుగమం అని లేదంటే కష్టమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
తెరాస అభివృద్ధి శూన్యమని, నాలుగోసారి కూడా గద్వాల కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేయ్యడం ఖాయమన్నది డి.కె వర్గీయుల వాదన. ఇప్పటికే డి.కె అరుణ మూడుసార్లు గద్వాల నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా గెలివటం గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా ఆ కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉండటం ఆమెకు కలసివచ్చే అంశాలు. కాంగ్రెస్ ఆయంలో జరిగిన అభివృద్ధే తప్ప తెరాస ప్రభుత్వం గద్వాల ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఇక్కడ ప్రాజెక్టులకు రూపం దాల్చింది తమ నాయకురాలు అయితే తెరాస ప్రభుత్వం వాటికే పూజలు చేసి ప్రజలను మబ్య పెట్టిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నాలుగో సారి కూడా గెలిపించడం నల్లేరు మీద నడక అని, గద్వాల కొట మీద కాంగ్రెస్ జెండా ఎగరేయ్యడం ఖాయమని డి.కె అరుణ వర్గానికి చెందిన వారు చెబుతున్నారు. గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో వీరిద్దరి మధ్యనే ఫోటి జరిగగా మూడో అభ్యర్థి బలంగా లేరు. 2019 ఎన్నికల్లో వీరితో పాటుగా ‘రాజుల వంశీయుల’గా గద్వాలలో మంచి గుర్తింపు ఉన్న ‘దొరలు’గా గద్వాల ప్రజలకు సుపరిచితులు అయిన ప్రముఖ న్యాయవాది వెంకటాద్రిరెడ్డి బిజెపి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ కు బిజెపి కేంద్ర మంత్రి అమీత్ షా ను వెంకటాద్రిరెడ్డి కలిశారు. గద్వాల బిజెపి టికెట్ పై వెంకటాద్రి రెడ్డికి హామీ ఇచ్చారని విస్వసనీయ సమాచారం. బిజెపి నుండి టికెట్ వచ్చినప్పటికి ప్రత్యర్థులైన డి.కె.అరుణ,బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలను డీకోని గెలవడం సాధ్యమేనా?అన్న చర్చ జరుగుతున్నది. వెంకటాద్రి రెడ్డి గారు మృదు స్వభావి.ఆయన కుటుంబనికి మంచి చరిత్ర (రాజుల వంశీయుల ప్రస్థానం) ఉండటం ఇక్కడి ప్రజల్లోకి పరిచయం అవసరం లేకుండా వెళ్లటనికి మార్గం సుగమం అవుతుందని అంటున్నారు.
డి.కె.అరుణ, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలా మధ్య ఓట్లు చీలితే వెంకటాద్రి రెడ్డికి అనుకూలం అవుతుందని అంటున్నారు. గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థులగా 2019లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అవుతారు కాబట్టి గద్వాల నియోజకవర్గంలో బడుగుల ఓట్లు ఎక్కవగా ఉండటం బీసి వర్గానికి చెందిన వారికి టికెట్ వచ్చి పోటీ చేస్తే గెలుపు ఖాయమని
కొందరు బీసీల వాదన.రాష్ట్ర బీసి కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ పేరు తెరమీదకు వస్తోంది. గతంలో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన బిసి వర్గానికి చెందిన గట్టు భీముడు సోదరుడు తిమ్మప్ప సైతం రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది. బీసిలమందరం ఎకమై ఎవరికి టికెట్ వచ్చిన కలసి పనిచేస్తే గెలుపు సాధ్యమేనని చెబుతున్నారు.అందుకు గాను తెరాస తరఫున డాక్టర్ ఆంజనేయ గౌడ్ కు టికెట్ ఇస్తే 2019లో గద్వాల గెలుపు సాధ్యమని
అంటున్నారు.