గాంధీభవన్ లో రాహుల్ జన్మదిన వేడుకలు.

హైదరాబాద్:
రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా గాంధీభవన్ లో కేక్ కట్ చేసిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజనికుమార్ యాదవ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని భావిభారత ప్రధానిగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అభివర్ణించాడు. 2019 లో రాహుల్ ను ప్రధానిని చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ పాటుపడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు.తర్వాత పటాకులు కాల్చి రాహుల్ కు శుభాకాంక్షలు తెలిపారు.