‘గాంధీ హంతకులే గాంధీ భజన చేస్తున్నారు’. – ఏఐఎస్ఎఫ్ నాయకుడు కన్హయ్య కుమార్.

హైదరాబాద్:

మహాత్మా గాంధీని చంపినవారే ఆయన భజన చేస్తున్నట్టు ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకుడు కన్హయ్య కుమార్ ఆరోపించారు. Tuwj,huj ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ‘,మీట్ ద ప్రెస్’ జరిగింది.గాంధీ అహింస, ధర్మం ని పాటించారని ఆయన చెప్పారు. రైల్ బోల్తా పడి చాలా మంది చనిపోయినప్పుడు బాధ్యత గా రాజీనామా చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు.మీడియా లో ఎంటైర్ టైన్ మెంట్, బిజినెస్ కు ప్రాధన్యత ఇస్తున్నారని విమర్శించారు.మీడియా కార్పొరేట్ శక్తుల చేతిలో బందీ అయినట్టు విమర్శించారు.
తాను సీపీఎం కాదు, సీపీఐ పార్టీకి చెందిన వ్యక్తి నని కన్హయ్య చెప్పారు.అవినీతి అంతం కోసం యువత పనిచేయాలని కోరారు.ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ రంగం ను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.

అవినీతి జరిగినా, తప్పు జరిగినా లాల్ బహదూర్ శాస్త్రి లాగా రాజీనామా చేసే నాయకులు లేరని చెప్పారు.ప్రస్తుతం తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ గా లేనన్నారు. పోటీ చేసేటప్పుడు చెప్తానన్నారు.
విపక్షాలు ఉంటేనే ప్రజల తరపున సమస్యలు గురించి మాట్లాడుతారని ఆయన తెలిపారు.సమ్మతి,అసమ్మతి ఎప్పటికైనా ఉంటుందన్నారు. అందుకే సీపీఐ నుండి విడిపోయి సీపీఎం ఏర్పడిందని, సీపీఎం నుండి విడిపోయి cpiml ఏర్పడిందని గుర్తు చేశారు. కార్పొరేట్ వర్గాలకు మాఫీ చేసిన ప్రభుత్వం రైతు లకు రుణమాఫీ చేయడానికి ఎందుకు ఆలోచన చేస్తుందని ప్రశ్నించారు.ప్రయివేటు రంగంలో కూడా అవినీతి ఉందన్నారు. కార్పొరేట్ రంగం దేశాన్ని పట్టి పిడిస్తుందని ఆరోపించారు.

దేశానికి బ్రాహ్మణ వాదం, కార్పోరేట్ దేశానికి పెను ప్రమాదం అని అంబెడ్కర్ ఆనాడే చెప్పాడని కన్హయ్య గుర్తు చేశారు.చార్జ్ షీట్ లేకుండా తన పైన తప్పుడు కేస్ లు పెడుతున్నారని ఆరోపించారు.