గిరిజన ద్రోహులయినందుకే చంపాం. – మావోయిస్టుపార్టీ.

విశాఖపట్నం:
అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ లను హత్య చేయడాన్ని మావోయిస్టుపార్టీ గట్టిగా సమర్ధించుకున్నది. ‘ప్రజాకోర్టు’లో వారిని శిక్షించినట్టు ఆ పార్టీ తెలిపింది. గిడ్డి ఈశ్వరిని మావోయిస్టులు ఈ ప్రకటనలో హెచ్చరించారు. అవినీతి సొమ్మును ప్రజలకు పంచకపోతే ‘శిక్ష’ తప్పదని తెలిపారు. అయితే ఈ ప్రకటనపై అనుమానాలు ఉన్నవి.ప్రకటన పార్టీ లెటర్ హెడ్ పైన రాయకపోవడం,దిగువన ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ’ అని మాత్రమే పేర్కొనడం,ఎరుపురంగు ఇంకుతో రాయడం అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది.