గుంటిపల్లి గ్రామం కేసీఆర్ కు ఏకగ్రీవం. – హరీష్ రావు.

గజ్వేల్:
మంత్రి హరీష్ రావు సమక్షంలో గుంటిపల్లి గ్రామ ప్రజలు కేసీఆర్ కే ఓటు వేస్తామని సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.” వానాకాలంలో ఉసిల్లు వచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడే గ్రామాల్లోకి కాంగ్రెస్ నాయకులు వస్తారు అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు.. గజ్వేల్ నియోజకవర్గంలో వర్గల్ మండలం గుంటి పల్లి గ్రామం టి ఆర్ ఎస్ పార్టీ కె… కేసీఆర్ కె మా ఓటు అని మంత్రి హరీష్ సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర పార్టీలకు డిపాజిట్లు రాకుండా కేసీఆర్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. గుంటిపల్లి గ్రామస్థులు ఆదర్శం అని అన్నారు. ప్రతి పక్షాల డిపాజిట్ లు గల్లంతు కావాలన్నారు.