గుండెపోటుతో రిటైర్డ్ సి.ఇ. శ్యామ్ ప్రసాదరెడ్డి కుమారుడు మృతి.

హైదరాబాద్:
రిటైర్డ్ సీఈ, ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37years) గుండెపోటుతో మృతి చెందారు. రాగన్న గూడెంలో నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి మంత్రి హరీష్ రావు తదితరులు నివాళులు అర్పించారు. శ్యాంప్రసాద్ రెడ్డిని మంత్రి హరీష్ రావు‌ పరామర్శించారు.విపిన్ చంద్ర భౌతిక కాయాన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సందర్శించారు.