గెలాక్సీ ‘ఎస్8 ‘ పై రూ.27,910 ఫ్లాట్ డిస్కౌంట్.

న్యూఢిల్లీ:
గత ఏడాది ఏప్రిల్ లో కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ని ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసింది. అప్పుడు దాని ధర రూ.57,900గా నిర్ణయించారు. ఈ ఏడాది గెలాక్సీ ఎస్9ని ప్రవేశపెట్టే వరకు శాంసంగ్ ఫోన్లలో ఎస్8దే హవా. ప్రస్తుత పండుగ అమ్మకాల సందర్భంగా ఎస్8 ఫోన్ పై శాంసంగ్, ఈకామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ కలిసి అవాక్కయ్యే బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వాస్తవ ఎమ్మార్పీ ధరపై రూ.27,910 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తూ కేవలం రూ.29,990కే గెలాక్సీ ఎస్8ని అమ్మబోతున్నాయి.ఏడాదిన్నర క్రితం మార్కెట్లోకి విడుదలైన గెలాక్సీ ఎస్8 స్మార్ట్ ఫోన్ ఒక ప్రీమియం, హై ఎండ్ ఫోన్. ఇందులో అగ్రశ్రేణి పరికరాలను అమర్చారు. అక్టోబర్ 10-14 వరకు జరగబోయే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో గెలాక్సీ ఎస్8 రూ.29,990కే దొరకనుంది. ఫోన్ ఫీచర్లు, పనితనంతో పోలిస్తే ఈ ధర కారుచౌకేనని చెప్పాలి.