గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ సంతోష్‌.

హైదరాబాద్:
రాష్ట్ర హోంమంత్రి నాయిని ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ ను ఎంపీ సంతోష్ కుమార్ స్వీకరించారు. హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చూసుకుంటానంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, సినీ నటుడు నాగార్జునకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.