‘గ్రీన్ ట్రిబ్యునల్’ కేసు విత్ డ్రా చేసుకోవాలి. – హరీశ్ రావు సవాల్.

  • 15 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే మంత్రి పదవికి రాజీనామా.

మహబూబ్ నగర్:
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి కేసును విత్‌డ్రా చేసుకున్నట్టుగా అఫిడవిట్ ఇప్పించిన పక్షం రోజులో కాలువల పనులు ప్రాంభించకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావ్ పరిగి ఎంఎల్ఎ టి.రాంమ్మోహన్‌రెడ్డి కు సవాల్ విసిరారు. పరిగి మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టును రూ.8015 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా మార్చుతూ వేసిన శిలాఫలకం ఆవిష్కరించేందుకు మంత్రి హరీష్‌రావ్, హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు వచ్చారు. పరిగి పట్టనంలోని పాలశీతలీ కరణ కేంద్రం ఎదురుగా టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతంర అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. లఖ్నాపూర్ ప్రాజెక్టుకు బయలుదేరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువ పనులు ఆపింది వికారాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా అని ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఓ వైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువ పనులు జరగకుండా, పనులు ఆపాలంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి పనులు ఆపి తిరిగి ఈ ప్రాజెక్టు పనులు టిఆర్‌ఎస్ ప్రభుత్వం, మంత్రులు పట్టించుకోవడం లేదంటూ ప్రజల ముందు చెప్పడం సరైంది కాదని సూచించారు. “పరిగి నియోజకవర్గ ప్రజలారా! మీరు ఎంఎల్ఎగా కాంగ్రెస్ పార్టీ టి.రాంమ్మోహన్‌రెడ్డిని గెలిపిస్తే అదే పార్టీకి చెందిన నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి పాలమూరు ప్రాజక్టు పనులపై స్టే తీసుకు వచ్చి మీకు నీరు రాకుండా అడ్డుపడ్డారన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మీ ఎంఎల్ఎ రాంమ్మోహన్‌రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ రైతుల పక్షాలన మాట్లాడి గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఉన్న కేసును వెనక్కి తీసుకోమని ఒత్తిడి తీసుకు వచ్చి, అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తామని ఒత్తిడి తీసుకు వచ్చి ప్రాజెక్టు పనులు జరిగేలా చూసి అప్పుడు మీకు పనులు చేయకుంటే టిఆర్‌ఎస్ పార్టీని తప్పుపట్టమనండంటూ సూచించారు. మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రాకుండా మీ నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా, పరిగి నియోజకవర్గ రైతులు శ్రేయేభిలాషిసివే అయితే ముందు మీ పార్టీ అధిష్టానంతో మాట్లాడి గ్రీన్ ట్రిబ్యునల్‌లో వేసిన కేసును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు అఫిడవిట్ ఇస్తే పదిహేను రోజుల్లో నేను కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తానంటూ” హరీీీశ్ హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టు కాలువ పనులను అడ్డుకొని రెండేళ్లు కావస్తుందని ఈ పాటికి సగానికి పైగా కాలువల నిర్మాణం పూర్తయ్యేదన్నారు. హర్షవర్ధన్‌రెడ్డి కేసు విత్‌డ్రా చేసుకోకపోయినా ప్రభుత్వం నుంచి మంచి లాయర్లను పెట్టామని రైతులకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారని తెలియజేశారు. కేసు విత్‌డ్రా చేసుకొన్న వెంటనే పనులు ప్రారంభిద్దాం లేదంటే కొన్నాళ్లు ఆగాల్సి వస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ స్వచ్చమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం పనులు ప్రారంభించి సక్సెస్ అయిన విషయం రాష్ట్ర మంతటికి తెలుసున్నారు. ఆగష్టు 15వ తేదీన ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ఇందుకు అధికారులు, కాంట్రాక్టర్లు నిర్వరామంగా పనిచేసి పనులు పూర్తి చేశారన్నారు. నీటిని ఫిల్టర్ చేయడము, సరఫరా చేయడమే తరువాయి అన్నారు. నాలుగేళ్లుగా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని సగర్వంగా చెప్పుకోవచ్చాన్నారు. ఇదే మిషన్ భగీరథ పనులను ఆనాడు కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం నుంచి నీరా అది సాధ్యం కాదు అంటూ అపహాస్యంగా మాట్లాడారు. నేడు మిషన్ భగీరథ పథకం సక్సెస్ అయిన శ్రీశైలం నుంచి పరిగి జాఫర్‌పల్లికి 228 కిలోమీటర్లకు పైగా నీరు పైపులద్వారా వచ్చి పరిగికి చేరుకోవడం చూసి వాళ్లు నోరు మూసుకున్నారన్నారు. ఎవరేమనుకున్నా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికి మంచినీటి సమస్యకు చెక్‌పెట్టాలన్న ఆలోచనతో మిషన్ భగీరథ పథకం తెచ్చి రాష్ట్రానికి స్వచమైన నీరు అందిస్తూ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిస్తుందని కేంద్ర మంత్రులే కితాబునిస్తున్నార
ని మంత్రులు హరీశ్, మహేందర్ రెడ్డి చెప్పారు.