చంద్రబాబుకు ‘హిజ్రాల’ గుడి.

నంద్యాల:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం నంద్యాలలో హిజ్రాలు ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు.
హిజ్రాలకు నెలకు రూ.1500 పెన్షన్‌ ఇస్తామన్న సీఎం హామీతో వారు దేవాలయ నిర్మాణం చేపట్టారు. ఆ దేవాలయ నిర్మాణానికి అభిరుచి మధు, ఎంపీ టీజీ వెంకటేశ్‌, మంత్రి అఖిలప్రియ సహకరిస్తున్నారు. 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.