చకిలం తిరుగుబాటు.

నల్గొండ:
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ సభ్యుడు చకిలం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కనగల్ మండలం తొరగల్లు లోని ఓ తోటలో అనుచరులు, కార్యకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. భవిషత్ కార్యాచరణ పై సమాలోచనలు జరిపారు.
నల్గొండలో ఒక పక్క ఇద్దరు మంత్రుల సభ జరుగుతుంటే, మరోపక్క ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్న నాయకులను పట్టించుకోవడం లేదంటూ చకిలం సమావేశం జరపడం చర్చకు దారితీసింది. వివిధ పార్టీల నుండి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువై, ఉద్యమ సమయం నుండి ఉన్న వారికి పార్టీలో సరైన గుర్తింపు లేదని కార్యకర్తల ఆవేదన వ్యక్తం చేశారు.